హత్య కేసులో ముగ్గురికి మరణ శిక్ష
- May 24, 2016
ముగ్గురు సౌదీ వ్యక్తులకు మరణ శిక్ష విధించింది న్యాయస్థానం. ఐదుగురు భారతీయ కార్మికుల్ని హింసించి, సజీవంగా వారిని పాతిపెట్టి హత్య చేసిన కేసులో న్యాయస్థానం దోషులకు ఈ శిక్ష విధించింది. 2010లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ ఫామ్‌ని అద్దెకు తీసుకున్న వృద్ధురాలు, నేలను తవ్వగా అక్కడ మనుషులకు చెందిన అస్థికలు లభించాయి. దాంతో, వెంటనే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. అక్కడి నుంచి అస్థికల్ని వెలికి తీయగా, ఓ ఐడీ కార్డ్ లభించింది. దాని ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టి హత్యాకాండకు పాల్పడినవారిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనతో సంబంధం ఉందన్న ఆరోపణలతో పలువుర్ని అరెస్ట్ చేయగా, అందులో ముగ్గుర్ని న్యాయస్థానం దోషులుగా గుర్తించింది. వారిలో ఇద్దరు ఇప్పటికే వివిద కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటూ జైల్లో ఉన్నా
తాజా వార్తలు
- షార్లెట్‌లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!









