మనీలా ఎయిర్‌పోర్ట్‌లో భద్రత పెంపు
- May 24, 2016
ఫిలిప్పీన్ యావియేషన్ అథారిటీ, మనీలాలోని నినాయ్ అక్వినో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. సౌదీ అరేబియా ఎంబసీ, తమకు అందిన ఓ బెదిరింపు కాల్‌తో మనీలా అధికారుల్ని అప్రమత్తం చేసింది. సౌదియా విమానాన్ని మిలిటెంట్లు టార్గెట్ చేశారన్నది ఆ బెదిరింపు కాల్ సారాంశం. యెమెన్‌కి చెందిన 10 మంది మిలిటెంట్లు సౌదీ అరేబియా ఎయిర్‌లైన్స్ (సౌదియా)పై టార్గెట్ పెట్టారనే సమాచారంతో భద్రతను కట్టుదిట్టం చేయడం జరిగింది. ఎయిర్‌పోర్ట్‌లో కనీ వినీ ఎరుగని రీతిలో భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇంకో వైపు ఈజిప్ట్ ఎయిర్ విమానం 804 గత గురువారం మెడిటేరియన్ సీలో కూలిపోయిన ఘటనకు సంబంధించి తీవ్రవాద కోణాన్ని కొట్టి పారేయలేని పరిస్థితి. బెదిరింపు కాల్, విమానం కూలిపోయిన ఘటన నేపథ్యంలో భద్రతా సిబ్బంది మరిన్ని కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. మనీలాలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రయాణీకుల తనికీలు నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







