‘పొలిమేర 2’.! చిన్న సినిమాకి భారీ ఓపెనింగ్స్.!
- November 04, 2023
‘విరూపాక్ష’ సినిమా తర్వాత ఆ తరహా సినిమాలకు ప్రేక్షకాదరణ పెరిగింది. ఆ కోవకు చెందిందే ‘పొలిమేర’ సినిమా. మొదటి పార్ట్ ఆ మధ్య రిలీజై మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇప్పుడు ఓటీటీలో అందుబాటులో వుంది. తాజాగా విడుదలైన ‘పొలిమేర 2’కీ మంచి ఆదరణ వస్తోంది.
చిన్న సినిమా అయినా మంచి ఓపెనింగ్స్ అందుకుంది ఈ సినిమా. చేతబడులు, క్షుద్ర పూజలు, నిధులు, నిక్షేపాల ప్రధాన కంటెంట్‌గా ఈ సినిమా రూపొందింది. సత్యం రాజేష్, కామాక్షి మెయిన్ లీడ్ రోల్స్ పోషించగా.. బాలాదిత్య, గెటప్ శీను తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.
ఓ చిన్న పల్లెటూరులో వున్న దేవాలయానికీ, కేరళలోని అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో వున్న నిధికీ సంబంధం ఏంటన్న కోణంలో ఈ సినిమా కథ సాగుతుంది. నాగ బంధనం.. తదితర అంశాల్ని చక్కగా చూపించారు.
సినిమాలోని ట్విస్టులు, ప్రేక్షకుల్ని ఆధ్యంతం ఆసక్తికి గురి చేసేలా వున్నాయ్. సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాల్ని గ్రిప్పింగ్‌గా చూపించిన విధానం ‘పొలిమేర 2’లో ఆకట్టుకుంటోంది. ‘పొలిమేర’ మొదటి పార్ట్ చూసి, రెండో పార్ట్ చూసిన వాళ్లు మరింత థ్రిల్ ఫీలవుతారు.. అంటూ చిత్ర యూనిట్ పబ్లిసిటీ చేస్తోంది.
దాంతో, ఓటీటీలో అందుబాటులో వున్న ‘పొలిమేర’ మొదటి పార్ట్‌కీ, అలాగే, ధియేటర్లోకి వచ్చిన రెండో పార్ట్‌కీ ఎట్ ఏ టైమ్ రెస్పాన్స్ వస్తోంది. ఒక్క దెబ్బకి రెండు పిట్టలన్న మాట.
ఇక, మొదటి రోజు నైజాంలో ‘పొలిమేర 2’ షాకింగ్ కలెక్షన్లు కలెక్ట్ చేసింది. అక్షరాలా అది కోటిన్నర పై మాటే వుంటుందని ట్రేడ్ వర్గాల అంచనా.
తాజా వార్తలు
- వైభవంగా ‘గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్’ వేడుక.. చిరంజీవి, నాగార్జున, కమల్ హాసన్ సందడి..
- సోషల్ మీడియా కంటెంట్ బ్లాకింగ్ పై కేంద్రం కొత్త రూల్స్
- ఐపీఎల్ 2026లో జట్ల హెడ్‌కోచ్‌లు వీళ్లే
- ఖతార్ లో నిరాటంకంగా ఆసుపత్రులు, ఆరోగ్య సేవలు..!!
- భార్య మృతికి కారణమైన భర్తకు జైలుశిక్ష ఖరారు..!!
- గ్రాండ్ మసీదులో ఈద్ ప్రార్థనలు రద్దు..!!
- ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన సుల్తాన్, భారత ప్రధాని మోదీ..!!
- ఇరాన్ దాడులకు వ్యతిరేకంగా ఏకమైన అరబ్, ఇస్లామిక్ దేశాలు..!!
- ఈద్ అల్ ఫితర్..ఉచిత, డిస్కౌంట్ ఆఫర్స్ కు ఫిదా..!!
- హైదరాబాద్ విమానాశ్రయానికి అవార్డు









