సౌదీ అరేబియాలో పరిశోధనలకు పెద్దపీట.. SR19.2 బిలియన్ల వ్యయం

- November 05, 2023 , by Maagulf
సౌదీ అరేబియాలో పరిశోధనలకు పెద్దపీట.. SR19.2 బిలియన్ల వ్యయం

రియాద్: సౌదీ అరేబియా పరిశోధన మరియు అభివృద్ధిపై వ్యయం SR19.2 బిలియన్లకు చేరుకుంది. ఇది 2021తో పోలిస్తే 32.7% గణనీయమైన పెరుగింది. ఈ మేరకు జనరల్ అథారిటీ ఫర్ స్టాటిస్టిక్స్ (GASTAT) గణాంకాలు తెలిపాయి. GASTAT 2022 కోసం పరిశోధన మరియు అభివృద్ధి గణాంకాల నివేదికను శుక్రవారం విడుదల చేసింది. ప్రభుత్వ రంగ నిధులు SR11.1 బిలియన్లు, మొత్తం పరిశోధన మరియు అభివృద్ధి నిధులలో 58% ఉన్నాయి. ప్రైవేట్ రంగ నిధులు SR7.5 బిలియన్లు, మొత్తం నిధులలో 39% వాటా కలిగి ఉంది. విద్యా రంగానికి మొత్తం నిధులలో 3% (SR558 మిలియన్లు)లభించింది. 2021తో పోలిస్తే, 2022లో దేశంలోని మొత్తం పరిశోధకుల సంఖ్య 21.6% పెరిగి 30,160 మందికి చేరుకుందని అథారిటీ తెలిపింది. మొత్తం పరిశోధకుల సంఖ్యలో 89% (26,750 మంది)విద్యా రంగం నుంచి ఉండగా.. ప్రైవేట్ రంగం 6% (1,810 మంది), ప్రభుత్వ రంగంలో 1,590 మంది(5%) పరిశోధకులు ఉన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com