పాలస్తీనియన్ల పై ఇజ్రాయెల్ ఊచకోతను ఖండించిన ఒమన్

- November 05, 2023 , by Maagulf
పాలస్తీనియన్ల పై ఇజ్రాయెల్ ఊచకోతను ఖండించిన ఒమన్

మస్కట్: పాలస్తీనా ప్రజలకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ ఆక్రమణ దళాలు కొనసాగిస్తున్న మారణకాండపై ఒమన్ సుల్తానేట్ శనివారం తీవ్రంగా ఖండించింది. పౌరులు మరియు ఆరోగ్య రంగ సౌకర్యాలను లక్ష్యంగా చేసుకోవడంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఉత్తర గాజా స్ట్రిప్‌లోని జబాలియాలోని UNRWAకి అనుబంధంగా ఉన్న అల్-ఫఖౌరా స్కూల్‌పై బాంబు దాడి జరిగింది. గాజా స్ట్రిప్‌కు దక్షిణాన ఉన్న రఫాకు తూర్పున అనేక పరిసరాలకు సరఫరా చేసే పబ్లిక్ వాటర్ ట్యాంక్‌పై బాంబు దాడి జరిగిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ఇజ్రాయెల్ ఏకపక్షంగా దాడులకు తెగబడుతుందని, అంతర్జాతీయ ఉల్లంఘనకు ముగింపు పలికేందుకు అంతర్జాతీయ కలిసి రావాలని సుల్తానేట్ పిలుపునిచ్చింది. ఇజ్రాయెల్ యుద్ధ నేరాలను విచారించడానికి ఒక న్యాయస్థానాన్ని ఏర్పాటు చేయమని అంతర్జాతీయ క్రిమినల్ కోర్టును అభ్యర్థించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com