జర్మనీ లోని హాంబర్గ్ ఎయిర్‌పోర్ట్ లో కాల్పులు
- November 05, 2023
జర్మనీ లోని హాంబర్గ్ ఎయిర్‌పోర్ట్ లో కాల్పుల ఘటన ప్రయాణికులను భయబ్రాంతులకు గురి చేసింది. శనివారం ఓ దుండగుడు వాహనంతో విమానాశ్రయం ప్రధాన గేటును పగలగొట్టి కాంప్లెక్స్ లకి వచ్చి విచక్షణా రహితంగా కాల్పులు చేసారు. కారులో దుండగుడితో పాటు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
దుండగుడు చేసిన కాల్పుల వల్ల శనివారం నాడు ఎలాంటి విమాన సర్వీసులు ఉండవని ఎయిర్ పోర్టు అధికారులు వెల్లడించారు. దీంతో విమానాలు అన్ని కూడా ఎక్కడివి అక్కడ నిలిచిపోయాయి. దుండగుడు జరిపిన కాల్పుల్లో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. ఈ ఘటన వల్ల సుమారు 27 విమాన సర్వీసులను నిలిపి వేసినట్లు అధికారులు తెలిపారు. కాల్పులు జరిపిన వ్యక్తి రెండు గాజు సీసాలకు నిప్పు పెట్టి విమానాశ్రయంలోనికి విసిరినట్లు పేర్కొన్నారు. దీంతో విమానాశ్రయంలోని కొన్ని ప్రాంతాల్లో మంటలు చెలరేగాయి.
తాజా వార్తలు
- టీటీడీ ఈవోకు శుభాకాంక్షలు తెలిపిన టిటిడి పాలక మండలి
- చరిత్ర సృష్టించిన యూఏఈ కెప్టెన్ ముహమ్మద్ వసీం..
- ఆలస్యం చేసిన వారికి చివరి ఛాన్స్!
- మస్కట్‌లో పార్కింగ్ సర్వే ప్రారంభం..!!
- త్వరలో ఆటోమేటిక్ వెహికల్ ఇన్ ఫెక్షన్ సెంటర్ ప్రారంభం..!!
- జిసిసి ప్రతినిధులతో అమీర్ సమావేశం..!!
- ‘శ్రావణం’ ఓనం ఉత్సవంలో గ్రాండ్ కాన్సర్ట్..!!
- కొత్త చట్టం.. గరిష్టంగా SR20,000 జరిమానా..!!
- యూఏఈ ప్రవాసిని వరించిన Dh1 మిలియన్ లాటరీ..!!
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..