ఢిల్లీ లో నవంబర్ 10 వరకు స్కూల్స్ కు సెలవులు
- November 05, 2023
న్యూ ఢిల్లీ: ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరింది. ఈ తరుణంలో నవంబర్ 10 వరకు స్కూల్స్ కు సెలవులు ప్రకటించాలని ఢిల్లీ విద్యాశాఖ మంత్రి అతిషి ఆదేశాలు జారీ చేసారు. ఈ సమయంలో పాఠశాలలు 6 నుండి 12 తరగతులకు ఆన్లైన్ తరగతులు నిర్వహించుకోవచ్చని సూచించారు.
ఢిల్లీ ప్రభుత్వంలోని విద్యాశాఖ మంత్రి అతిషి మాట్లాడుతూ ఢిల్లీలో అధిక స్థాయికి వాయు కాలుష్యం చేరుకుందన్నారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఇలాంటి కీలక నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఈ కాలుష్యం ముఖ్యంగా ఇది పిల్లలకు చాలా హానికరం కావొచ్చు. వాయు కాలుష్యం దృష్ట్యా, ఢిల్లీ ప్రభుత్వం 2023 నవంబర్ 10 నాటికి ఢిల్లీలోని అన్ని ప్రాథమిక పాఠశాలలను మూసివేయాలని నిర్ణయించింది.
మరోపక్క శనివారం ఉదయం నాటికి చూసుకుంటే వాయు నాణ్యత సూచీ (ఏక్యూఐ) 504కి చేరిపోయింది. జహంగీర్‌పురిలో ఈ సూచీ 702, సోనియా విహార్‌లో 618కి పడిపోవడాన్ని చూస్తే పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థమవుతోంది.
మరోవైపు ఢిల్లీలో విష వాయువుల గాఢత (పీఎం) 2.5 స్థాయిలోనే ఉండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. వాస్తవానికి ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) జారీ చేసినటువంటి ప్రమాణాల కంటే దాదాపు 80 రెట్లు అధికంగా ఉంది. అయితే ఈ గాలిని పీల్చుకోవడం వల్ల ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురికావడం, అలాగే కంటి దురద, శ్వాసకోశ సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని వైద్యులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- మస్కట్‌లో పార్కింగ్ సర్వే ప్రారంభం..!!
- త్వరలో ఆటోమేటిక్ వెహికల్ ఇన్ ఫెక్షన్ సెంటర్ ప్రారంభం..!!
- జిసిసి ప్రతినిధులతో అమీర్ సమావేశం..!!
- ‘శ్రావణం’ ఓనం ఉత్సవంలో గ్రాండ్ కాన్సర్ట్..!!
- కొత్త చట్టం.. గరిష్టంగా SR20,000 జరిమానా..!!
- యూఏఈ ప్రవాసిని వరించిన Dh1 మిలియన్ లాటరీ..!!
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!