'గాలంట్ నైట్ 3' ఆపరేషన్ ప్రారంభించాలి.. యూఏఈ ప్రెసిడెంట్ ఆదేశం
- November 06, 2023
యూఏఈ: గాజా స్ట్రిప్‌లోని పాలస్తీనా ప్రజలను ఆదుకోవడానికి 'గ్యాలంట్ నైట్ 3' అనే మానవతా చర్యను ప్రారంభించాలని యూఏఈ అధ్యక్షుడు, హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ రక్షణ మంత్రిత్వ శాఖ యొక్క జాయింట్ ఆపరేషన్స్ కమాండ్‌ను ఆదేశించారు. ఎమిరేట్స్ రెడ్ క్రెసెంట్, ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఫౌండేషన్, జాయెద్ ఛారిటబుల్ & హ్యుమానిటేరియన్ ఫౌండేషన్ మరియు ఇతర యూఏఈ సంస్థలతో కలిసి ప్రస్తుత సంఘర్షణతో ప్రభావితమైన పాలస్తీనియన్ ప్రజలకు మానవతావాద మద్దతును అందించాలని జాయింట్ ఆపరేషన్స్ కమాండ్‌ను ఆదేశించారు. ఆరోగ్య మరియు నివారణ మంత్రిత్వ శాఖ, అబుదాబి ఆరోగ్య శాఖలో నమోదు చేసుకున్న వైద్యులకు, యూఏఈలోని ఎమిరేట్స్ రెడ్ క్రెసెంట్, ఇతర మానవతా మరియు స్వచ్ఛంద సంస్థలలో రిజిస్టర్ చేసుకున్న వాలంటీర్లకు అవకాశం ఇవ్వాలని తన ఉత్తర్వుల్లో సూచించారు అధ్యక్షుడు. గతంలో తీవ్ర భూకంపాలకు గురైన సిరియా, టర్కీ ప్రజలకు సహాయం చేయడానికి "గాలంట్ నైట్ 2" ఆపరేషన్‌ను యూఏఈ చేపట్టింది.
తాజా వార్తలు
- జెడ్డాలో ప్రారంభమైన జ్యువెలరీ ఎక్స్పోజిషన్..!!
- కువైట్ లో భారత రాయబారిగా పరమితా త్రిపాఠి..!!
- కార్మికుడికి Dh1.5 మిలియన్ల పరిహారం..!!
- ప్రాంతీయ పరిణామాలపై యూఎన్ సెక్రటరీ జనరల్ ఆరా..!!
- అమెరికా వైస్ ప్రెసిడెంట్ తో ఖతార్ పీఎం సమావేశం..!!
- పోలీసుల అదుపులో పలువురు మోటార్ సైక్లిస్టులు..!!
- బీసీసీఐ అధ్యక్షుడి రేస్ లో ప్రముఖ క్రికెటర్ లు?
- ఒమన్ పై పాక్ విజయం..
- భారత దేశం మొత్తం టపాసులు బ్యాన్..
- రష్యాలో భారీ భూకంపం