గాజా బాధితులకు ఉచితంగా చికిత్స.. ముందుకొచ్చిన ప్రైవేట్ ఆసుపత్రులు
- November 06, 2023
కువైట్: కువైట్లోని ప్రైవేట్ ఆసుపత్రులు గాజా స్ట్రిప్ నుండి గాయపడిన వారికి ఉచితంగా చికిత్స చేయడానికి ముందుకొచ్చాయి. గాజాలో మానవతావాద పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ చర్య తీసుకున్నట్లు ఆరోగ్య మంత్రి డాక్టర్ అహ్మద్ అల్-అవధికి రాసిన లేఖలో నేషనల్ హాస్పిటల్స్ యూనియన్ అధిపతి డాక్టర్ అయ్మాన్ అల్-ముతావా తెలియజేసారు. కువైట్ రాష్ట్రం ప్రాంతీయంగా.. అంతర్జాతీయంగా పోషిస్తున్న మార్గదర్శక మానవతా పాత్రలో ఇది భాగం అన్నారు. అల్-సలామ్, అలియా, దార్ అల్-షిఫా, వారా, అల్-మౌవసాత్ మరియు తైబా ఆసుపత్రులతో సహా ప్రైవేట్ ఆసుపత్రులు గాజా నుండి గాయపడిన వ్యక్తులకు ఉచితంగా చికిత్స చేసేందుకు తమ సంసిద్ధతను వ్యక్తం చేశాయి. కువైట్ లో గాజా బాధితుల చికిత్స కేసులను స్వీకరించాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- జెడ్డాలో ప్రారంభమైన జ్యువెలరీ ఎక్స్పోజిషన్..!!
- కువైట్ లో భారత రాయబారిగా పరమితా త్రిపాఠి..!!
- కార్మికుడికి Dh1.5 మిలియన్ల పరిహారం..!!
- ప్రాంతీయ పరిణామాలపై యూఎన్ సెక్రటరీ జనరల్ ఆరా..!!
- అమెరికా వైస్ ప్రెసిడెంట్ తో ఖతార్ పీఎం సమావేశం..!!
- పోలీసుల అదుపులో పలువురు మోటార్ సైక్లిస్టులు..!!
- బీసీసీఐ అధ్యక్షుడి రేస్ లో ప్రముఖ క్రికెటర్ లు?
- ఒమన్ పై పాక్ విజయం..
- భారత దేశం మొత్తం టపాసులు బ్యాన్..
- రష్యాలో భారీ భూకంపం