ఏపీలో దీపావళి సెలవులో మార్పు: ప్రభుత్వం ఉత్తర్వులు
- November 06, 2023
అమరావతి: ఏపీ సర్కారు దీపావళి సెలవు విషయంలో మార్పు చేసింది. వాస్తవానికి గతంలో విడుదల చేసిన 2023 సెలవుల జాబితాలో దీపావళి పండుగకు నవంబరు 12న సెలవు ప్రకటించారు. అయితే, ఇప్పుడు దీపావళి సెలవును నవంబరు 13కి మార్చుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ నోటిఫికేషన్ జారీ చేశారు.
నవంబరు 12న ఆదివారం వచ్చింది. ఇంతకుముందు నవంబరు 13వ తేదీ ఆప్షనల్ హాలిడేగా ఉండగా, ఇప్పుడు దాన్ని ఏపీ ప్రభుత్వం సాధారణ సెలవుగా మార్పు చేసింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్‌లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్‌తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







