సిడ్నీ నుండి దుబాయ్ విమానంలో సాంకేతిక లోపం

- June 26, 2015 , by Maagulf
సిడ్నీ నుండి దుబాయ్  విమానంలో సాంకేతిక లోపం

విమానంలో సాంకేతిక లోపం వచ్చింది. దీంతో దాన్ని అత్యవసరంగా దింపాల్సిన పరిస్థితి ఏర్పడింది. అత్యవసరంగా విమానాన్ని దింపడంతో ప్రయాణికులు ఊపిరి పిల్చుకున్నారు. ఎలాంటి ప్రమాదం జరగకుండ చూసిన విమానం పైలెట్లను ప్రయాణికులతో పాటు అధికారులు అభినందించారు. సిడ్నీ నుండి దుబాయ్ కి ఎమిరేట్స్ విమానం ఏ-380-ఈకే 413 బయలుదేరింది. దుబాయ్ వెళుతున్న సమయంలో విమానంలో సాంకేతిక లోపం తలెత్తిందని పైలెట్లు గుర్తించారు. వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించారు. పై అధికారుల అనుమతితో విమానాన్ని శ్రీలంక రాజధాని కొలంబోలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అధికారులు విమానంలో క్షుణ్ణంగా పరిశీలించారు. ఎక్కడ సాంకేతిక లోపం వచ్చిందనేది ఆరా తీశారు. విమానంలో మొత్తం 500 మంది ప్రయాణికులు, అధికారులు ఉన్నారు. అయితే విమానంలో ఎలాంటి సాంకేతిక లోపం వచ్చిందనేదిఅధికారులు వెల్లడించలేదు. అయితే పైలెట్ లు సమయానికి స్పందించి విమానం కిందకు దించారని అందరూ వారిని అభినందించారు.

 

--సి.శ్రీ(దుబాయ్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com