హోటళ్లు, బీచ్‌లపై తుపాకీ గుళ్ల వర్షం
- June 26, 2015
ట్యూనీషియాలోనూ ఉగ్రవాదులు తెగబడ్డారు. రెండు పర్యాటక హోటళ్లతోపాటు, సమీపంలోని బీచ్‌లో తుపాకులతో విచక్షణారహితంగా దాడులకు పాల్పడ్డారు. ఉగ్రవాదుల కాల్పుల్లో 27 మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక మీడియా కథనం ప్రకారం.. మృతుల్లో విదేశీయులు సైతం ఉన్నారు. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కాల్పుల ఘటనతో బీచ్‌లో సేదతీరుతున్న వారు, హోటళ్లలో ఉన్నవారంతా భయభ్రాంతులకు గురయ్యారు. పరిసర ప్రాంతాలకు చెందిన వారు కూడా పేలుడు శబ్ధాలు విని ఆందోళనకు గురయ్యారు. ఏం జరుగిందనే విషయం ఎవరూ స్పష్టంగా చెప్పడం లేదని స్థానిక మీడియా పేర్కొంది. మృతి చెందిన వారిలో యూరప్, ఉత్తర ఆఫ్రికా దేశస్తులే ఎక్కువగా ఉన్నారని తెలిసింది. భద్రతా దళాలు ఓ ఉగ్రవాదిని కాల్చిచంపాయి. కాగా, ఓ ఉగ్రవాది బీచ్‌లో కాల్పులకు పాల్పడంతో అక్కడికక్కడే ఏడుగురు ప్రాణాలు కోల్పోయారని ట్యూనీషియా అంతర్గత వ్యవహారాల శాఖ తెలిపింది. మార్చి నెలలో ఇస్లామిస్ట్ ఉగ్రవాదులు ట్యూనీషియాలోని బార్డో మ్యూజియంపై కాల్పులు జరిపిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







