పెట్టుబడిదారులకు గుడ్ న్యూస్.. రియాద్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ప్రారంభం

- November 07, 2023 , by Maagulf
పెట్టుబడిదారులకు గుడ్ న్యూస్.. రియాద్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ప్రారంభం

రియాద్: రియాద్ స్పెషల్ ఎకనామిక్ జోన్ల కోసం సెంటర్ ఏర్పాటును ఆవిష్కరించినట్లు రాయల్ కమీషన్ ఫర్ రియాద్ సిటీ (RCRC) డైరెక్టర్ల బోర్డు ప్రకటించింది. ఈ వ్యూహాత్మక చర్య రియాద్ వ్యాపార పోటీతత్వాన్ని పెంపొందిస్తుందని పేర్కొంది. సౌదీ రాజధానిని ఒక ప్రముఖ అంతర్జాతీయ కేంద్రంగా ముందుకు తీసుకెళ్లడం, ప్రపంచవ్యాప్తంగా ప్రధాన నగర ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా దాని స్థానాన్ని పటిష్టం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు డైరెక్టర్ల బోర్డు తెలిపింది.  రియాద్‌లోని ప్రత్యేక ఆర్థిక మండలాల అభివృద్ధిని RCRC పర్యవేక్షిస్తుంది. ప్రత్యేక ఆర్థిక మండలాల్లోని పెట్టుబడిదారులకు లైసెన్సులను జారీ చేయడానికి కేంద్రం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com