యూఏఈ లో ఆరోగ్య బీమా ప్రీమియంలు ప్రియం.. 35% వరకు పెరుగుదల

- November 07, 2023 , by Maagulf
యూఏఈ లో ఆరోగ్య బీమా ప్రీమియంలు ప్రియం.. 35% వరకు పెరుగుదల

యూఏఈ: గత రెండు నెలల్లో దాదాపు డజను కంపెనీలు ప్రీమియంలను 35 శాతం వరకు పెంచాయి. దీంతో యూఏఈ నివాసితులు తమ ఆరోగ్య బీమా ప్రీమియంల కోసం ఎక్కువ మొత్తం చెల్లించాల్సి వస్తుంది.  “రేట్లు ఆగస్ట్ 2023 నుండి పెరగడం ప్రారంభించి సెప్టెంబర్ మరియు అక్టోబర్ వరకు కొనసాగాయి. బీమా సంస్థకు సంబంధించిన తాజా రేట్ సవరణ అక్టోబరు మధ్యలో జరిగింది. దరఖాస్తుదారుడి వయస్సు ఆధారంగా సగటు ధర 10 శాతం నుండి 35 శాతం మధ్య పెరిగింది" అని పాలసీబజార్ హెల్త్ అండ్ మోటార్ ఇన్సూరెన్స్ బిజినెస్ హెడ్ తోషితా చౌహాన్ అన్నారు. వైద్యపరమైన ఖర్చులు పెరగడంతో ప్రతి సంవత్సరం ప్రిమియం ధరలు 15 శాతం నుండి 20 శాతం వరకు పెరుగుతున్నాయని ఇండస్ట్రీ అధికారులు చెబుతున్నారు.

యూఏఈలో  నిర్బంధ ఆరోగ్య బీమా కొన్ని సంవత్సరాల క్రితం ప్రవేశపెట్టబడింది. ఉద్యోగులకు ఆరోగ్య బీమా కవరేజీని అందించడానికి యజమాని బాధ్యత. అయితే, యజమాని పిల్లలకు బీమా అందించకపోతే, తల్లిదండ్రులు వారి స్పాన్సర్‌షిప్‌లో ఉన్నందున వారి కోసం ఆరోగ్య బీమాను కొనుగోలు చేయాలి. మరోవైపు యూఏఈ ప్రపంచ స్థాయి ఆరోగ్య బీమా రంగాన్ని కలిగి ఉంది. ఇది దేశంలోకి అనేక మంది ఆరోగ్య పర్యాటకులను ఆకర్షిస్తోంది. దుబాయ్‌లో మాత్రమే గత సంవత్సరం 674,000 మంది వైద్య పర్యాటకులు వచ్చారు. Dh992 మిలియన్లు ఖర్చు చేశారు. ఇది గత సంవత్సరం కంటే Dh262 మిలియన్ల అధికం కావడం గమనార్హం. 

అయితే, నెలవారీ Dh4,000 కంటే తక్కువ సంపాదిస్తున్న ఉద్యోగుల కోసం దుబాయ్ హెల్త్ అథారిటీ (DHA) ప్రాథమిక ప్లాన్‌తో కనీస ప్రీమియం మారలేదని చౌహాన్ వెల్లడించారు. నెలవారీ Dh4,000 కంటే ఎక్కువ సంపాదిస్తున్న ఉద్యోగులకు సంబంధించి ప్రాథమిక బీమా కోసం కొత్త ధర 18 నుండి 45 సంవత్సరాల మధ్య ఉన్న వివాహిత మహిళలకు 10 శాతం పెరిగింది. వారి భర్తలు స్పాన్సర్ చేసిన వారి ధర 20 శాతం పెరిగింది. 30 శాతానికి పెరిగిందన్నారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com