తూచ్.! అదంతా వుత్తదే - హరీష్ శంకర్.!
- November 07, 2023
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాకి సంబంధించి మొదట్నుంచీ ఏదో ఒక గాలి వార్తలు వస్తూనే వున్నాయ్. సినిమా మొత్తానికి ఆగిపోయిందన్నారు. ఎలాగోలా స్టార్ట్ అయ్యింది.
షూటింగ్ మొదలైనా కూడా ఈ గాలి వార్తలు ఆగలేదు. ఆపేశారట.. అంటూ వినిపిస్తూనే వున్నాయ్. తాజాగా ఇంకోసారి. 20 రోజులు మాత్రమే షూటింగ్ జరిగిందనీ.. ఇప్పుడు ఆగిపోయిందనీ.. ఈ సినిమా ఆగిపోవడంతో మాస్ రాజాతో సినిమా పట్టాలెక్కనుందనీ సరికొత్త ప్రచారం తెరపైకి వచ్చింది.
జనవరి నుంచి మాస్ రాజా రవితేజతో హరీష్ శంకర్ సినిమా స్టార్ట్ చేస్తున్నాడనీ గట్టిగా ప్రచారం జరగడంతో ఆ ముచ్చట కాస్తా హరీష్ శంకర్ వరకూ చేరింది. సోషల్ మీడియా వేదికగా ఆయన ఆ రూమర్‌ని ఖండించారు.
‘ఉస్తాద్’ విషయంలో వస్తున్న రూమర్లన్నీ తప్పుడు వార్తలే అని క్లారిటీ ఇచ్చారు. రవితేజ సినిమా ఇప్పట్లో కాదనీ.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పూర్తయ్యాకే ఆ సినిమా పట్టాలెక్కుతుందనీ ఇలాంటి గాలి వార్తలు పుట్టించేవాళ్లకి గతంలోనూ చాలా సార్లు వార్నింగ్ ఇచ్చాను.. ఇప్పుడు మళ్లీ.! అని హరీష్ సోషల్ మీడియా వేదికగా రెస్పాండ్ అయ్యారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల
- డ్రగ్స్ కేసుల్లో చిక్కుకున్న విదేశీయులను వెనక్కి పంపనున్న కేంద్రం
- టీటీడీ ఈవోకు శుభాకాంక్షలు తెలిపిన టిటిడి పాలక మండలి
- చరిత్ర సృష్టించిన యూఏఈ కెప్టెన్ ముహమ్మద్ వసీం..