మణిపూర్లో మొబైల్ ఇంటర్నెట్ నిషేధం
- November 09, 2023
ఇంఫాల్: మణిపూర్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మొబైల్ ఇంటర్నెట్ నిషేధాన్ని నవంబర్ 13వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు మణిపూర్ ప్రభుత్వం ప్రకటించింది. ఇటీవల జరిగిన కాల్పుల్లో 10 మంది గాయపడిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో మొబైల్ ఇంటర్నెట్పై నిషేధాన్ని పొడిగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.
బిష్ణూపూర్, ఇంఫాల్ ఈస్ట్, ఇంఫాల్ వెస్ట్, కాంగ్పోక్పి జిల్లాలో రెండు కమ్యూనిటీల మధ్య కాల్పులు జరుగుతున్నాయని మణిపూర్ డీజీపీ వెల్లడించారు. మరో ఇద్దరు వ్యక్తులు అదృశమయ్యారని, నలుగురు వ్యక్తులను గుర్తు తెలియని దుండగులు అపహరించారని తెలిపారు. దీంతో అక్కడ నిరసనలు వ్యక్తం అవుతున్నాయని పేర్కొన్నారు. హింసను ప్రేరేపించే చిత్రాలు, ద్వేషపూరిత ప్రసంగాలు, వీడియోలను వ్యతిరేక వ్యక్తులు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసే అవకాశం ఉందని, దాంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని, అందుకే మొబైల్ ఇంటర్నెట్పై నిషేధం పొడిగించినట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







