మిడిల్ ఈస్ట్ సంక్షోభం.. భారీగా తగ్గిన హాలిడే ట్రావెల్ బుకింగ్‌లు!

- November 09, 2023 , by Maagulf
మిడిల్ ఈస్ట్ సంక్షోభం.. భారీగా తగ్గిన హాలిడే ట్రావెల్ బుకింగ్‌లు!

బహ్రెయిన్: సాధారణంగా బహ్రెయిన్‌లో క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలను జరుపుకోవడానికి విదేశీ ప్రయాణానికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అయితే, ఈ పండుగ కాలంలో ఫ్లైట్ బుకింగ్‌లకు అసాధారణంగా డిమాండ్ తగ్గడంతో ట్రావెల్ ఏజెంట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సంవత్సరం  ట్రావెల్ ఏజెంట్లు బుకింగ్‌లలో గణనీయమైన తగ్గుదలని చూస్తున్నారు. ట్రావెల్ నిట్స్ & వకాన్జా డైరెక్టర్ థాహా మార్జూక్ ఓ ఇంటర్వ్యూలో వింటర్ హాలిడే ఫ్లైట్ బుకింగ్‌లకు ఊహించని రీతిలో డిమాండ్ తక్కువగా ఉందన్నారు. బుకింగ్‌లు తగ్గడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ లో నెలకొన్న సంక్షోభం కారణాంగా చాలామంది హాలీడే ప్రణాళికలకు దూరంగా ఉన్నట్లు పేర్కొన్నారు. యూకే,  టర్కీ వంటి ప్రసిద్ధ శీతాకాల సెలవుల గమ్యస్థానాలకు కూడా గత సంవత్సరంతో పోల్చితే తక్కువ బుకింగ్‌లు నమోదు అవుతున్నాయని మార్జూక్ వివరించారు. అయితే, రాబోయే బహ్రెయిన్ జాతీయ దినోత్సవ సెలవుల సందర్భంగా హాలీడే ప్యాకేజీలకు డిమాండ్ ఉంటుందని భావిస్తున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com