పర్యావరణ పరిరక్షణకు ఫత్వాలు జారీకి నిపుణుల డిమాండ్!
- November 09, 2023
యూఏఈ: సుస్థిరత అనేది ఇస్లాం ప్రాథమిక సిద్ధాంతం. భూమిని సంరక్షించడం అంటే మతాన్ని పరిరక్షించినట్లే అని అబుదాబిలోని మొహమ్మద్ బిన్ జాయెద్ యూనివర్శిటీ ఫర్ హ్యుమానిటీస్ ప్రొఫెసర్ డాక్టర్ వదీమా అల్ ధాహెరి అన్నారు. అందుకే పర్యావరాణ పరిరక్షణకు ముస్లింలందరికీ కట్టుబడి ఉండాలరి పిలుపునిచ్చారు. కాలుష్యాన్ని నియంత్రించేందుకు, అదే సమయంలో పర్యావరణ పరిరక్షణకు ఇస్లామిక్ చట్టం చేయాలని కోరారు. యూఏఈ కౌన్సిల్ ఫర్ ఫత్వా అంతర్జాతీయ సదస్సులో మొదటి రోజున ఆమె ప్రసంగించారు. ఇందులో పాల్గొన్న నిపుణులు ఇది అనేక అంశాలపై చర్చించారు. పర్యావరణాన్ని ఎలా సంరక్షించడం, సుస్థిరతను నిర్ధారించడం ఇస్లాం ప్రధాన భాగమని వక్తలు ప్రధానంగా అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా యూఏఈ ఇండిపెండెంట్ క్లైమేట్ చేంజ్ యాక్సిలరేటర్స్ ప్రెసిడెంట్, సీఈఓ అయిన షేఖా షమ్మా బింట్ సుల్తాన్ బిన్ ఖలీఫా అల్ నహ్యాన్ తన కీలక ప్రసంగంలో స్థిరమైన కొత్త భవిష్యత్తుకు అనుగుణంగా మారడం అనేది గతంలో కంటే చాలా అత్యవసరమని అన్నారు. యూఏఈ ఈ నెలాఖరున దుబాయ్లో COP28కి ఆతిథ్యం ఇస్తుంది. పారిస్ ఒప్పందంపై దాని పురోగతిని సమీక్షిస్తారు.
తాజా వార్తలు
- పార్టనర్షిప్ బలోపేతానికి సౌదీ అరేబియా, కెనడా చర్చలు..!!
- జెరూసలేంలో ఇజ్రాయెల్ ఆంక్షలు..ఖండించిన అరబ్, ఇస్లామిక్ దేశాలు..!!
- దుబాయ్ లో కువైట్ ఆయిల్ ట్యాంకర్ పై ఇరాన్ దాడి..!!
- ఒమన్ పై ద్రోణి ఎఫెక్ట్..రెండు రోజులపాటు వర్షాలు..!!
- పెట్రోల్, డీజిల్ ధరలు ప్రకటించిన యూఏఈ..!!
- రీఫండ్, తేదీ మార్పులకు ఖతార్ ఎయిర్వేస్ అవకాశం..!!
- VerSe Innovation లో ఇండిపెండెంట్ డైరెక్టర్గా పి.ఆర్.రమేష్ నియామకం
- TANA ప్రపంచ సాహిత్యవేదిక 90వ సమావేశం ఘన విజయం
- అమెరికా పర్యటనకు కేటీఆర్
- శంషాబాద్ ఎయిర్పోర్ట్లో భారీగా డ్రగ్స్ సీజ్









