సౌదీ లో తెలంగాణ వాసి మృతి

- June 26, 2015 , by Maagulf
సౌదీ లో తెలంగాణ వాసి మృతి

బతుకుదెరువు కోసం సౌదీకి వెళ్లిన బద్వేలు వాసిని విధి చిన్న చూపు చూసింది... వారం రోజుల్లో ఇంటికి వస్తాడు, రమదాన్ ను సంబరంగా చేసుకుందామని కటుంబ సభ్యులు ఎదురు చూస్తుండగా ఆయన అనంతలోకాలకు వెళ్లాడు... ఇక తిరిగి రాడని తెలుసుకుని వారు గుండెలవిసేలా రోదించారు. బద్వేలు అర్బన్ : పట్టణంలోని ఆర్టీసీ బస్టాండు వెనుక వైపు గల మహబూబ్‌నగర్‌లో నివసిస్తున్న షేక్ అక్బర్‌బాషా(45) శుక్రవారం తెల్లవారుజామున సౌదీ అరేబియాలోని నజ్రాన్ సమీపంలో గల షరార్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. వారం రోజుల్లో ఇండియాకు రానుండగా ప్రమాదం చోటు చేసుకోవడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. షేక్ అక్బర్‌బాషా ఇక్కడ డ్రైవర్‌గా పని చేస్తూ 2013లో సౌదీకి వెళ్లాడు. అక్కడ క్రూడాయిల్ తరలించే ట్యాంక ర్లకు డ్రైవర్‌గా పని చేస్తుండే వాడు. ఈ క్రమంలో నజ్రాన్ నుంచి 250 కిలోమీటర్లు దూరంలో గల షరార్ వద్దకు క్రూడాయిల్‌ను తరలిస్తుండగా ప్రమాదవశాత్తు ట్యాంకర్ ముందు భాగంలో ఉన్న టైరు పగిలిపోవడంతో బోల్తా పడింది. ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే మృతి చెందారని సౌదీ నుంచి సమాచారం అందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతదేహాన్ని ప్రభుత్వం ఇండియాకు తెప్పించాలి కుటుంబ పోషణ భారం కావడంతో ఆయన రెండేళ్ల క్రితం సౌదీకి వెళ్లాడు. ఈ క్రమంలో ఆయన చనిపోయాడని సమాచారం రావడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగారు. ఈ ఏడాది కుటుంబ సభ్యులతో కలిసి రంజాన్ పండుగ చేసుకోవాలనుకుని ఆయన అక్కడే సామగ్రిని, బట్టలను కొనుగోలు చేసి సిద్ధంగా ఉంచుకోగా.. ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమని వారు కన్నీరుమున్నీరయ్యారు. ప్రభుత్వం స్పందించి సౌదీ నుంచి మృతదేహాన్ని ఇండియాకు తెప్పించాలని కుటుంబ సభ్యులు వేడుకున్నారు. ఆయనకు భార్య షకీలాతోపాటు కుమార్తె అస్పియా(16), షేక్‌సోహెల్(14), షేక్ మహమ్మద్ యూనస్(12) ఉన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com