ముల్లా హైబతుల్లా అకుందాజాదాను తాలిబన్లు కొత్తనేత
- May 24, 2016
ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ నేత ముల్లాహ్ అక్తార్ మన్సూర్ మృతిని తాలిబన్లు ధ్రువీకరించారు. తమ నూతన నాయకుడిగా ముల్లా హైబతుల్లా అకుందాజాదాను ఎన్నుకున్నట్లు ప్రకటించారు. ఇటీవల ఆఫ్ఘనిస్థాన్‌లో అమెరికా సైన్యం చేపట్టిన డ్రోన్ దాడుల్లో తాలిబన్ నేత మన్సూర్ మృతిచెందిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు ఒబామా ధ్రువీకరించారు.పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో శనివారం కారులో ప్రయాణిస్తుండగా జరిగిన దాడుల్లో మన్సూర్ మృతిచెందారని తాలిబన్లు ప్రకటన ద్వారా వెల్లడించారు. తాలిబన్ల నాయకుడు ముల్లాహ్ మహమ్మద్ ఒమర్ మరణించడంతో 2015 జులైలో మన్సూర్‌ను తాలిబన్ నేతగా ఎన్నుకున్నారు. ఇప్పుడు అతడి మరణంతో ముల్లా హైబతుల్లాను కొత్తనేతగా ప్రకటించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







