ప్రముఖ టాలీవుడ్ నిర్మాత రవీంద్ర బాబు మృతి
- November 12, 2023
హైదరాబాద్: టాలీవుడ్ లో శనివారం రెండు విషాదాలు చోటుచేసుకున్నాయి. అనారోగ్యం కారణంగా సీనియర్ నటుడు చంద్రమోహన్ తుది శ్వాస విడిచారు. ఈయన మరణ వార్త చిత్రసీమ ను షాక్ కు గురి చేసింది. టాలీవుడ్ ప్రముఖులంతా ఆయనను కడసారి చూసేందుకు తరలివచ్చారు. రేపు సోమవారం చంద్రమోహన్ అంత్యక్రియలు జరగనున్నాయి.
ఇదిలా ఉండగానే చిత్రసీమలో మరో విషాదం చోటుచేసుకుంది. శ్రావ్య ఫిలిమ్స్ వ్యవస్థాపక నిర్మాత యక్కలి రవీంద్ర బాబు ఆరోగ్య సమస్య తో శనివారం మధ్యాహ్నం కన్నుమూశారు. ఆరోగ్య సమస్యతో హైదరాబాద్ సిటీలో ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చేరిన ఆయన… చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.
ఆయనకు భార్య రమా దేవి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వృత్తిరీత్యా రవీంద్ర బాబు చార్టెడ్ ఇంజనీర్. ఆయన స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో గల మార్కాపురం. సొంత ఊరిలో పదో తరగతి వరకు చదివిన ఆయన… ఉన్నత చదువులకు వేరే ఊరు వెళ్లారు. మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత చార్టర్డ్ ఇంజనీర్ ఉద్యోగం చేశారు. సినిమాలపై ఇష్టంతో నిర్మాతగా పరిశ్రమలో అడుగు పెట్టారు. శ్రావ్య ఫిలిమ్స్ పతాకంపై తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో సినిమాలు ప్రొడ్యూస్ చేశారు యక్కలి రవీంద్ర బాబు. నిర్మాతగా ఈ ప్రయాణంలో 17కు పైగా సినిమాలు తీశారు. సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో రవీంద్ర బాబు ఎక్కువ సినిమాలు చేశారు.
తాజా వార్తలు
- రూ.10 వేలు దాటితే గంట వెయిటింగ్..డిజిటల్ మోసాలకు ఆర్బీఐ ‘చెక్’!
- ఆదాయపన్ను శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ సురేశ్ బత్తిని
- హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ‘హైదరాబాద్ స్ట్రీట్’ ప్రారంభం
- RGIAలో సుమారు ₹4.6 కోట్ల విలువైన హైడ్రోపోనిక్ గంజాయి స్వాధీనం, ఇద్దరి అరెస్టు
- నగదు టోల్‌కు గుడ్‌బై..FASTag/UPI తప్పనిసరి
- ఇన్‌స్టాగ్రామ్‌లో టీనేజర్ల కోసం మెటా కొత్త రూల్స్ ఇవే
- మయన్మార్ అధ్యక్షుడిగా మిన్ ఆంగ్ హ్లాయింగ్ ప్రమాణ స్వీకారం
- తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త
- హర్మూజ్ పై మొజ్తాబా ఖమేనీ కీలక ప్రకటన
- యూఏఈ–భారత్ స్నేహాన్ని ప్రతిబింబిస్తూ విద్యార్థుల ప్రదర్శన









