న్యాయ సహకారం పై ఒమన్, బహ్రెయిన్ కీలక చర్చలు

- November 13, 2023 , by Maagulf
న్యాయ సహకారం పై ఒమన్, బహ్రెయిన్ కీలక చర్చలు

మస్కట్: బహ్రెయిన్‌లోని సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ వైస్ ప్రెసిడెంట్, కోర్టు ఛైర్మన్ షేక్ ఖలీద్ అలీ అల్ ఖలీఫా నేతృత్వంలోని బహ్రెయిన్ ప్రతినిధి బృందాన్ని ఆదివారం ఒమన్ సుప్రీంకోర్టు ఛైర్మన్ సయ్యద్ ఖలీఫా సయ్యద్ అల్ బుసైదీ తన కార్యాలయంలో ఆహ్వానించారు. ఈ సమావేశంలో ఒమన్ - బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు. న్యాయ రంగంలో తమ అభిప్రాయాలను మార్పిడి చేసుకున్నారు. జీసీసీ సుప్రీం కోర్ట్‌లు, కోర్ట్ ఆఫ్ కాసేషన్‌ల మధ్య అభిప్రాయాలు మరియు నైపుణ్యం మార్పిడిని ప్రోత్సహించే కార్యక్రమంలో భాగంగా బహ్రెయిన్ న్యాయ ప్రతినిధి బృందం ఒమన్ లో పర్యటిస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com