జీసీసీ యూనిఫైడ్ టూరిస్ట్ వీసాతో యూఏఈలో రెంట్స్ పెరుగుతాయా?
- November 13, 2023
యూఏఈ: గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) సభ్య దేశాలు ప్రపంచవ్యాప్తంగా పర్యాటకుల కోసం స్కెంజెన్-వంటి వీసా మాదిరిగానే యూనిఫైడ్ పర్యాటక వీసాను తీసుకొచ్చారు. దీంతో యూఏఈలో స్వల్పకాలిక అద్దెల కోసం డిమాండ్ పెరుగుతోందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. గత వారం ఒమన్‌లో జరిగిన గల్ఫ్ దేశాల అంతర్గత మంత్రుల సమావేశంలో ఒకే GCC టూరిస్ట్ వీసాను ఆమోదించిన విషయం తెలిసిందే. ఈ వీసాపై వచ్చేవారు 30 రోజులపాటు ఉండవచ్చు. జీసీసీ దేశాల్లో మొత్తం 837 పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. వీటిలో 399 ప్రాంతాలు యూఏఈలోనే ఉన్నాయి. స్కెంజెన్ దేశాలు ఏకీకృత వీసాను క్యాష్ చేస్తున్నట్లే.. యూఏఈ, పొరుగు దేశాలు లాభపడతాయని టూరిజం, హాస్పిటాలిటీ మరియు రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్‌లు అత్యంత విశ్వాసంతో ఉన్నారు. దుబాయ్ టూరిజం విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. జనవరి - సెప్టెంబర్ 2023 మధ్య కాలంలో 12.4 మిలియన్ల మంది ప్రజలు ఎమిరేట్‌ను సందర్శించారు.
తాజా వార్తలు
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!







