దీపావళి శుభాకాంక్షలు తెలిపిన యూఏఈ ప్రెసిడెంట్
- November 13, 2023
యూఏఈ: యూఏఈలోని భారతీయ ప్రవాసులకు యూఏఈ అధ్యక్షుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. "యూఏఈలో.. ప్రపంచవ్యాప్తంగా దీపావళిని జరుపుకుంటున్న వారందరికీ మా శుభాకాంక్షలు. రాబోయే సంవత్సరం అందరికీ శాంతి, ఆరోగ్యం మరియు ఆనందాన్ని అందించాలని కోరుకుంటున్నాము" అని ఆయన పేర్కొన్నారు. యూఏఈ ప్రెసిడెంట్ హిందీలో కూడా అదే ట్వీట్ చేసారు. అలాగే యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి మరియు దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలా ఉండగా.. యూఏఈలోని నివాసితులు దీపావళి సందర్భంగా తమ బాల్కనీలను రంగు రంగుల పూవులతో అలంకరించారు. అనేక రంగులలో మెరిసే అద్భుత దీపాలను ఏర్పాటు చేశారు. దుబాయ్, అల్ మంఖూల్, బుర్ దుబాయ్, కరామా మరియు అల్ బర్షా వంటి ప్రాంతాల్లోని భవనాలు రంగురంగుల లైట్లతో వెలిగిపోయాయి.
हम यूएई और विश्व भर में दीपावली मना रहे सभी लोगों को शुभकामनाएँ देते हैं। आने वाला वर्ष सभी के लिए शांति, स्वास्थ्य और ख़ुशहाली लेकर आए।
— محمد بن زايد (@MohamedBinZayed) November 12, 2023
తాజా వార్తలు
- రూ.10 వేలు దాటితే గంట వెయిటింగ్..డిజిటల్ మోసాలకు ఆర్బీఐ ‘చెక్’!
- ఆదాయపన్ను శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ సురేశ్ బత్తిని
- హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ‘హైదరాబాద్ స్ట్రీట్’ ప్రారంభం
- RGIAలో సుమారు ₹4.6 కోట్ల విలువైన హైడ్రోపోనిక్ గంజాయి స్వాధీనం, ఇద్దరి అరెస్టు
- నగదు టోల్‌కు గుడ్‌బై..FASTag/UPI తప్పనిసరి
- ఇన్‌స్టాగ్రామ్‌లో టీనేజర్ల కోసం మెటా కొత్త రూల్స్ ఇవే
- మయన్మార్ అధ్యక్షుడిగా మిన్ ఆంగ్ హ్లాయింగ్ ప్రమాణ స్వీకారం
- తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త
- హర్మూజ్ పై మొజ్తాబా ఖమేనీ కీలక ప్రకటన
- యూఏఈ–భారత్ స్నేహాన్ని ప్రతిబింబిస్తూ విద్యార్థుల ప్రదర్శన









