హైదరాబాద్ లో ఘోర అగ్ని ప్రమాదం..ఏడుగురు సజీవ దహనం
- November 13, 2023
హైదరాబాద్: హైదరాబాద్ లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. నాంపల్లిలోని బజార్ ఘాట్ లో ఉన్న ఓ గోడౌన్ లో సోమవారం మంటలు ఎగిసిపడ్డాయి. ఐదు అంతస్తుల వరకు మంటలు వ్యాపించాయి. దీంతో లోపల ఉన్న వర్కర్లు మంటల్లో చిక్కుకున్నారు. ఏడుగురు వర్కర్లు సజీవదహనమయ్యారని సమాచారం. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి నాలుగు ఫైరింజన్లు ప్రమాద స్థలానికి చేరుకున్నాయి. వాటితో మంటలను అదుపులోకి తెచ్చేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.
గోడౌన్ ఉన్న భవనం గ్రౌండ్ ఫ్లోర్ లో మెకానిక్ షెడ్ ఉందని, టపాసులు పేల్చడంతో షెడ్ లోని డీజిల్ డబ్బాలకు నిప్పంటుకుందని స్థానికులు చెప్పారు. గోడౌన్ లో కెమికల్స్ ఉండడంతో మంటలు వేగంగా పై అంతస్తులకు పాకాయని డీఆర్ఎఫ్ సిబ్బంది తెలిపారు. మంటల్లో చిక్కుకున్న పదిహేను మందిని కాపాడినట్లు తెలిపారు. ఉదయం 9:30 గంటల ప్రాంతంలో గ్రౌండ్ ఫ్లోర్ లో నిప్పంటుకుందని వివరించారు. ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. నాంపల్లిలోని బజార్ ఘాట్ లో ఉన్న ఓ గోడౌన్ లో సోమవారం మంటలు ఎగిసిపడ్డాయి. ఐదు అంతస్తుల వరకు మంటలు వ్యాపించాయి. దీంతో లోపల ఉన్న వర్కర్లు మంటల్లో చిక్కుకున్నారు. ఏడుగురు వర్కర్లు సజీవదహనమయ్యారని సమాచారం. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి నాలుగు ఫైరింజన్లు ప్రమాద స్థలానికి చేరుకున్నాయి. వాటితో మంటలను అదుపులోకి తెచ్చేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. గోడౌన్ ఉన్న భవనం గ్రౌండ్ ఫ్లోర్ లో మెకానిక్ షెడ్ ఉందని, టపాసులు పేల్చడంతో షెడ్ లోని డీజిల్ డబ్బాలకు నిప్పంటుకుందని స్థానికులు చెప్పారు. గోడౌన్ లో కెమికల్స్ ఉండడంతో మంటలు వేగంగా పై అంతస్తులకు పాకాయని డీఆర్ఎఫ్ సిబ్బంది తెలిపారు. మంటల్లో చిక్కుకున్న పదిహేను మందిని కాపాడినట్లు తెలిపారు. ఉదయం 9:30 గంటల ప్రాంతంలో గ్రౌండ్ ఫ్లోర్ లో నిప్పంటుకుందని వివరించారు.
తాజా వార్తలు
- రూ.10 వేలు దాటితే గంట వెయిటింగ్..డిజిటల్ మోసాలకు ఆర్బీఐ ‘చెక్’!
- ఆదాయపన్ను శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ సురేశ్ బత్తిని
- హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ‘హైదరాబాద్ స్ట్రీట్’ ప్రారంభం
- RGIAలో సుమారు ₹4.6 కోట్ల విలువైన హైడ్రోపోనిక్ గంజాయి స్వాధీనం, ఇద్దరి అరెస్టు
- నగదు టోల్‌కు గుడ్‌బై..FASTag/UPI తప్పనిసరి
- ఇన్‌స్టాగ్రామ్‌లో టీనేజర్ల కోసం మెటా కొత్త రూల్స్ ఇవే
- మయన్మార్ అధ్యక్షుడిగా మిన్ ఆంగ్ హ్లాయింగ్ ప్రమాణ స్వీకారం
- తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త
- హర్మూజ్ పై మొజ్తాబా ఖమేనీ కీలక ప్రకటన
- యూఏఈ–భారత్ స్నేహాన్ని ప్రతిబింబిస్తూ విద్యార్థుల ప్రదర్శన









