యమ్మీ యమ్మీ హెల్దీ హెల్దీ మష్రూమ్స్

- June 26, 2015 , by Maagulf
యమ్మీ యమ్మీ హెల్దీ హెల్దీ మష్రూమ్స్

మష్రూమ్స్.. ఈ పేరు వింటే ఎవరికైనా నోరూరక మానదు. మసాలా గట్టిగా దట్టించి, జీడిపప్పు కాంబినేషన్లో కూర వండితే ఎవ్వరికైనా లాలాజలం ఊరక తప్పదు. అంతటి రుచి మష్రూమ్స్ది మరి. అయితే రుచి సంగతి సరే గానీ.. మష్రూమ్లో కేలరీలు చాలా ఎక్కువ. కొలెస్ట్రాల్ చాలా తక్కువ. ఉదాహరణకు 250 గ్రాముల మష్రూమ్స్లో ఇంచుమించుగా 80 శాతం కేలరీలు ఉంటాయట. లావుగా ఉన్నవాళ్లకు ఇవి ఆహారంలో తరచూ ఉండేలా చూసుకుంటే చాలా వరకూ కొలెస్ట్రాల్ తగ్గే అవకాశం ఉంటుందట. అంతేకాదు మష్రూమ్స్తో శరీరానికి వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. కాన్సర్ కారకాలను నియంత్రించే శక్తి కూడా ఈ మష్రూమ్స్కి ఉందట. మష్రూమ్స్లో యాంటీ ఆక్సిడెంట్లు, సెలీనియం కారకాలు అధికంగా ఉండడం వల్ల గుండెకు సంబంధించిన అనేక సమస్యలకు ఇవి మంచి ఔషధంగా పని చేస్తాయి. అన్ని వయసుల వారూ మష్రూమ్స్ తినడం చాలా మంచిది. అనారోగ్యంతో బాధపడే పిల్లలకు వారంలో కనీసం రెండుసార్లు మష్రూమ్స్ తింటే మంచి ఫలితం ఉంటుంది. వీటిలోని పోషకాలు పిల్లల మెదడుకు చురుకుతనాన్ని కూడా అందించి పిల్లలు యాక్టివ్గా ఉండేందుకు సహకరిస్తాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com