గుమ్మడి గింజలతో ఇన్నిఆరోగ్య ప్రయోజనాలా.?
- November 14, 2023హిందూ సనాతన ధర్మంలో గుమ్మడి కాయకు ప్రత్యేకమైన పవిత్ర స్థానం వుంది. పండుగలు, పెళ్లిళ్లు వంటి శుభకార్యాల్లో గుమ్మడి కాయను ప్రత్యేకంగా వినియోగిస్తుంటారు.
అయితే, గుమ్మడికాయను ఆహారంలో తీసుకోవడం మాత్రం చాలా అరుదుగా చేస్తుంటారు. కొంతమంది మాత్రమే గుమ్మడిని ఆహారంలో వినియోగిస్తుంటారు.
కానీ, గుమ్మడి కాయలో చాలా రకాల విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా వుంటాయ్. ముఖ్యంగా డయాబెటిస్ వున్నవాళ్లు గుమ్మడి తింటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అదుపులో వుంటాయ్.
గుమ్మడి కాయలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు నొప్పుల్ని తగ్గించే శక్తిని కలిగి వున్నాయ్. అలాగే, క్యాన్సర్ కోసం వినియోగించే మందుల్లోనూ గుమ్మడి గింజల్ని వినియోగిస్తారని వైద్య శాస్త్రం చెబుతోంది.
శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ని పెంచడంలో గుమ్మడి గింజలు తోడ్పడతాయ్. అందుకే గుమ్మడి గింజల్ని గ్రేవీల కోసం కూరల్లో వినియోగించడం మంచదని నిపుణులు చెబుతున్నారు.
ఇంకెందుకాలస్యం.. ఇక నుంచి గుమ్మడితో పాటూ, గుమ్మడి గింజల్నీ వంటకాల్లో భాగం చేసుకోండిక.!
తాజా వార్తలు
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు
- శుభవార్త. కొత్తగా 10 ఏళ్ల బ్లూ రెసిడెన్సీ వీసా