యూఏఈలో 19-సీట్ల ఎలక్ట్రిక్ సీప్లేన్!

- November 15, 2023 , by Maagulf
యూఏఈలో 19-సీట్ల ఎలక్ట్రిక్ సీప్లేన్!

యూఏఈ: పూర్తిగా విద్యుత్తుతో నడిచే 19-సీట్ల సీప్లేన్ నమూనా యూఏఈ మార్కెట్‌లో అందరినీ ఆకట్టుకుంటుంది. జెక్తా, స్విస్ ఎలక్ట్రిక్ సీప్లేన్ తయారీదారు దుబాయ్ ఎయిర్‌షోలో తన తాజా ఆవిష్కరణము ప్రారంభించారు. దాని వినూత్న డిజైన్‌ మెగా-సిటీలు, యూఏఈ వంటి తీర ప్రాంతాల ప్రజలకు మరింత స్థిరమైన మరియు తక్కువ ఖర్చుతో కూడిన రవాణాను అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ప్యాసింజర్ హైడ్రో ఎయిర్‌క్రాఫ్ట్ జీరో ఎమిషన్స్ లేదా PHA-ZE 100, ఇది ఒక ఉభయచర విమానం. 2028లో మార్కెట్‌లోకి ప్రవేశించే అవకాశం ఉంది. "జెట్కా ఫేజ్ 100ని అభివృద్ధి చేస్తోంది. ఇది పూర్తిగా విద్యుత్ శక్తితో నడిచే 19-సీట్ల సీ ప్లేన్. ఉభయచర ఫ్లయింగ్ బోట్. ఇది నీటిపై దిగుతుంది.”అని జెట్కా కమ్యూనికేషన్స్ హెడ్ జేన్ స్టాన్‌బరీ అన్నారు. 10 విమానాల కొనుగోలుకు ఒప్పందం చేసుకున్న దుబాయ్‌కు చెందిన కంపెనీతో మొదటి లెటర్ ఆఫ్ ఇంటెంట్ (LOI) సంతకం చేసినట్లు స్టాన్‌బరీ వివరించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com