కువైట్ లో 66 మిలియన్ దినార్ల ట్రాఫిక్ జరిమానాలు జారీ
- November 15, 2023
కువైట్: ప్రస్తుత 2023 సంవత్సరానికి ట్రాఫిక్ ఉల్లంఘనల మొత్తం విలువ సుమారు 66 మిలియన్ దినార్లు అని జనరల్ ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్‌లోని ట్రాఫిక్ ఉల్లంఘనల పరిశోధన విభాగం డైరెక్టర్ బ్రిగేడియర్ జనరల్ ముహమ్మద్ సాద్ అల్-ఒటైబి తెలిపారు. 2023 సంవత్సరంలో మొత్తం 1,748,368 చెల్లించని ట్రాఫిక్ ఉల్లంఘనలు జరిగాయని, వీటి మొత్తం విలువ 44 మిలియన్ దినార్‌లను మించిందని ఓ ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. ఈ ఉల్లంఘనల్లో ఎక్కువ భాగం శాశ్వతంగా దేశం విడిచి వెళ్లిన ప్రవాసులవి ఉన్నాయని తెలిపారు. ఈ ఏడాది తీవ్రమైన ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన 122 మంది ప్రవాసులను దేశం నుంచి బహిష్కరించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ట్రాఫిక్ ఉల్లంఘనలు పూర్తిగా ఆటోమేటిక్‌గా మారాయన్నారు. ఉల్లంఘన రిజిస్టర్ చేయబడిన క్షణంలో సిస్టమ్‌లో రికార్డ్ చేయబడుతుందని, "సహల్" అప్లికేషన్ ద్వారా ఉల్లంఘించిన వ్యక్తికి సందేశం పంపబడుతుందని, ఉల్లంఘనల దర్యాప్తు విభాగంలో అభ్యంతరం చెప్పడానికి లేదా ఎలక్ట్రానిక్ చెల్లింపు లింక్ ద్వారా వెంటనే చెల్లించడానికి అతనికి హక్కు ఉంటుందని తెలిపారు.
తాజా వార్తలు
- ఇబ్రిలో స్టంట్ డ్రైవింగ్..ఎనిమిది మంది డ్రైవర్లు అరెస్ట్..!!
- జంతువులను వదిలేస్తున్నారా? కఠిన చర్యలు..!!
- ఖలీద్ బిన్ అహ్మద్ ఇంటర్ఛేంజ్ ఎగ్జిట్ మూసివేత..!!
- తొలి ఆర్వీ రూట్ ను ప్రారంభించిన దుబాయ్..!!
- భారత్-న్యూజిలాండ్ మధ్య కుదిరిన ఫ్రీ ట్రేడ్ డీల్
- తిరుమలలో వైకుంఠద్వార దర్శనాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
- జనవరి 2 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
- వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ సక్సెస్…
- చికాగోలో ఘనంగా చలనచిత్ర సంగీత కచేరీ
- సైనిక సిబ్బంది పై దాడి..ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..!!







