కువైట్‌ మ్యాచ్ కు తాము సిద్ధం: భారత ఫుట్‌బాల్ కోచ్

- November 16, 2023 , by Maagulf
కువైట్‌ మ్యాచ్ కు తాము సిద్ధం: భారత ఫుట్‌బాల్ కోచ్

కువైట్: ఫిఫా వరల్డ్ కప్ ఆసియా క్వాలిఫయర్స్ మ్యాచ్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నట్లు భారత జాతీయ జట్టు ప్రధాన కోచ్ ఇగోర్ స్టిమాక్ అన్నారు. భారత్‌, కువైట్‌లు రెండూ చాలా మంచి జట్లేనని, గురువారం అద్భుతమైన ఆటను ఆశించవచ్చని పేర్కొన్నారు. జబర్‌ అల్‌ అహ్మద్‌ ఇంటర్నేషనల్‌ స్టేడియంలో మీడియాతో ఆయన మాట్లాడారు. "మేము బాగా సన్నద్ధమయ్యాముజ మేము గత కొన్ని రోజులుగా దుబాయ్‌లో ఉన్నాము. కువైట్ తో జరుగనున్న మ్యాచ్‌లో బాగా ఆడటానికి మేము ప్రయత్నిస్తాం" అని కోచ్ స్టిమాక్ చెప్పారు. భారత జాతీయ జట్టు FIFA ప్రపంచ కప్ 2026 మరియు AFC ఆసియా కప్ సౌదీ అరేబియా 2027 జాయింట్ క్వాలిఫికేషన్ మ్యాచ్‌లో కువైట్ జాతీయ జట్టుతో నవంబర్ 16వ తేదీన జబర్ అల్-అహ్మద్ ఇంటర్నేషనల్ స్టేడియంలో కువైట్‌లో తలపడుతుంది. రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com