కొత్త అబుదాబి విమానాశ్రయ టెర్మినల్ నుంచి సేవలు ప్రారంభం
- November 16, 2023
యూఏఈ: డిసెంబర్‌లో 12 నుంచి అబుదాబి విమానాశ్రయ టెర్మినల్ అందుబాటులోకి రానుంది. దాదాపు 220 విమానాల్లో ప్రయాణించే 2.29 మిలియన్ల మంది ప్రయాణికులు కొత్త టెర్మినల్ సేవలు అందించనుంది. నవంబర్ మొదటి రెండు వారాల్లో 1,557 విమానాలు ఇక్కడి నుంచి ట్రయల్స్ నిర్వహించారు. నెలాఖరు నాటికి, మొత్తం విమానాల సంఖ్య 7,600 కు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. అబుదాబి ఎయిర్‌పోర్ట్స్ మేనేజింగ్ డైరెక్టర్, తాత్కాలిక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎలెనా సోర్లిని మాట్లాడుతూ.. అన్ని విమానయాన సంస్థలు ఇప్పుడు టెర్మినల్ A నుండి పనిచేస్తున్నందున, అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయంలో కార్యకలాపాలకు కొత్త శకాన్ని ప్రారంభించాయని అన్నారు. అయితే, టెర్మినల్ Aపై అధికారిక ప్రారంభోత్సవం ఫిబ్రవరి 9, 2024న జరుగుతుంది. ఇది జరిగిన తర్వాత, విమానాశ్రయం జాయెద్ అంతర్జాతీయ విమానాశ్రయంగా పేరు మార్చబడుతుంది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







