ప్రపంచంలోనే అత్యంత ఫాస్టెస్ట్ ఇంటర్నెంట్ నెట్‌వర్క్‌ను ఆవిష్కరించిన చైనా
- November 16, 2023
బీజింగ్: ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ నెట్‌వర్క్ ఉంది. టెక్నాలజీలో తరచూ ఏదో సంచలనం సృష్టించే చైనా ఇప్పుడు మరో సెన్సేషన్ క్రియేట్ చేసింది. చైనా కంపెనీలు తాజాగా ప్రపంచంలోనే అత్యంత ఫాస్టెస్ట్ ఇంటర్నెంట్ నెట్‌వర్క్‌ను ఆవిష్కరించాయి. ఈ నెట్‌వర్క్ సెకనుకు 1.2 టెరాబైట్స్ వేగంతో డేటాను ట్రాన్స్‌మిట్ చేయగలదట. ప్రస్తుతం వినియోగంలో ఉన్న ప్రధాన ఇంటర్నెట్ రూట్స్ కంటే ఇది దాదాపు 10 రెట్లు వేగంగా పనిచేస్తోందట. సింగ్వా విశ్వవిద్యాలయం, చైనా మొబైల్, హువావే టెక్నాలజీస్, సెర్నెట్ కార్పొరేషన్ సమష్టిగా ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేశాయట. ఒక్క సెకనులో 150 సినిమాలు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది కూడా హెచ్డీ మూవీస్.. భవిష్యత్‌లో మరింత వేగమైన నెట్‌వర్క్‌ను రూపొందించేందుకు ప్రయత్నిస్తామని.. హువావే టెక్నాలజీస్ వైస్ ప్రెసిడెంట్ వాంగ్ లీ తెలిపారు.
కాగా, ప్రపంచంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యాధునిక ఇంటర్నెట్ టెక్నాలజీ అత్యధికంగా సెకనుకు 100 జీబీ డాటాను మాత్రమే మార్పిడి చేయగలదు. ఇటీవల అమెరికా సెకనుకు 400 జీబీ డాటాను మార్పిడి చేయగల నెట్‌వర్క్‌ను నిర్మించింది. దీంతో పోల్చితే చైనా నెట్‌వర్క్ నాలుగింతలు. ఈ నెట్‌వర్క్ నిర్మాణం కోసం చైనా పదేండ్లుగా పరిశోధన చేస్తున్నది. ఈ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ నెట్‌వర్క్‌ను బీజింగ్, వుహాన్, గాంగ్‌ఝౌ మధ్య 3000 కిలోమీటర్ల పొడవున ఏర్పాటుచేశారు. సింఝువా యూనివర్సిటీ, హువావే టెక్నాలజీస్, సెర్నెట్ కార్పొరేషన్ కలిసి ఈ అద్భుతాన్ని ఆవిష్కరించినట్టు సౌత్‌చైనా మార్నింగ్ పోస్ట్ పత్రిక తెలిపింది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







