దుబాయ్ పార్కింగ్ స్థలంలో 2 వాహనాలు దగ్ధం

- November 16, 2023 , by Maagulf
దుబాయ్ పార్కింగ్ స్థలంలో 2 వాహనాలు దగ్ధం

దుబాయ్: బుధవారం ఉదయం పార్కింగ్ స్థలంలో 2 వాహనాలు దగ్ధమయ్యాయి. దుబాయ్ సౌత్ లో ఉదయం 10.50 గంటలకు అగ్నిప్రమాదం సంభవించింది. దుబాయ్ సివిల్ డిఫెన్స్ ప్రకారం.. అగ్నిమాపక సిబ్బంది నాలుగు నిమిషాల్లో సంఘటనా స్థలానికి చేరుకుని మండలను అదుపుచేశారు. దగ్ధమైన వాటిల్లో ఒక కారు, ఒక SUV ఉంది. ఫైర్ ఫైటర్స్ 10 నిమిషాల్లో మంటలను ఆర్పారు.  ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు పేర్కొన్నారు.  కాగా,  అగ్నిప్రమాదానికి కారణమేమిటో పౌర రక్షణ శాఖ పేర్కొనలేదు. అయితే, యూఏఈలో సమగ్ర వాహన బీమా సాధారణంగా అగ్నిప్రమాదం వల్ల కలిగే నష్టాలను కవర్ చేస్తుంది. నష్టపరిహారాన్ని క్లెయిమ్ చేయడానికి వాహనదారులు బీమా కంపెనీకి పోలీసు నివేదికను సమర్పించాలి. థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ హోల్డర్‌లు వారు పార్క్ చేసిన సౌకర్యం పథకం పరిధిలోకి వస్తే నష్టాన్ని క్లెయిమ్ చేయవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com