స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు...
- November 17, 2023
భారత దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్‌బ్యాంక్ ఆఫ్ఇండియాలో భారీగా ఉద్యోగ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. దేశ వ్యాప్తంగా వివిధ సర్కిళ్లలో ఉన్న మొత్తం 8,773 జూనియర్ అసోసియేట్స్ రెగ్యులర్, బ్యాక్ లాగ్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 600 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధులు డిసెంబర్ 7లోపు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
విద్యార్హతలు:
అభ్యర్థులు ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. డిగ్రీ ఫైనల్ చదువుతున్నవారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులే.
వయో పరిమితి:
20 ఏళ్ల నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. (2029 ఏప్రిల్ 1 నాటికి). రిజర్వేషన్ల ఆధారంగా వయో పరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం:
ఆన్లైన్ విధానంలో పరీక్ష ఉంటుంది. ప్రిలిమినరీ పరీక్ష జనవరిలో, మెయిన్ పరీక్ష ఫిబ్రవరిలో ఉండే అవకాశాలు ఉన్నాయి. పరీక్ష ఇంగ్లీష్, హిందీతో పాటు స్థానిక భాషల్లోనూ నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ పరీక్ష తెలుగు, ఇంగ్లిష్, హిందీ, ఉర్దూ భాషల్లో రాసేందుకు అవకాశం ఉంటుంది.
ప్రిలిమినరీ పరీక్ష 100 మార్కులకు, మెయిన్ పరీక్ష 200 మార్కులకు ఉంటుంది. తప్పు సమాధానానికి పావుమార్కు మైనస్ చేస్తారు. ఎస్సీ/ఎస్టీ. బీసీ/ఎక్స్‌సర్వీస్‌మెన్’ మత సంబంధిత మైనారిటీ వర్గాలకు చెందిన అభ్యర్థులకు ఆన్లైన్లో ప్రీ ఎగ్జామినేషన్ కోచింగ్ ఇస్తారు.
పరీక్షా కేంద్రాలు :
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలివే. అనంతపురం, భీమవరం, చీరాల, గూడూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నంద్యాల, నరసరావుపేట, నెల్లూరు, రాజమండ్రి రాజంపేట, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం; తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్గొండ, వరంగల్ లలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.
బేసిక్ వేతనం:
రూ. 18,900 నుంచి మొదలవుతుంది తరువాత అంచెలంచెలుగా పెరుగుతుంది. ఎంపికైన అభ్యర్థులకు 8 మాసాల పాటు ప్రొబేషన్ పిరియడ్ ఉంటుంది.
దరఖాస్తు రుసుం:
ఎస్సీ,ఎస్టీ,దివ్యాంగులు, ఎక్స్‌సర్వీస్‌మెన్, దివ్యాంగ ఎక్స్‌సర్వీస్‌మెన్ కేటగిరీ అభ్యర్థులు ఎలాంటి దరఖాస్తు రుసుం చెల్లించనవసరం లేదు. జనరల్/ ఓబీసీ/ఈడబ్యూఎస్ అభ్యర్థులు రూ.50 చొప్పున ఫీ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
దరఖాస్తు పూర్తి చేయడంలో, ఫీజు చెల్లింపులో ఇబ్బందులేవైనా తలెత్తితే 022 2282042 నంబర్‌కు కాల్ చేయవచ్చు. బ్యాంకు పనివేళల్లో ఉదయం 11గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఈ నెంబరు అందుబాటులో ఉంటుంది.
దరఖాస్తుగడువు డిసెంబర్ 7గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు https://bank.sbi/web/careers/current-openings పరిశీలించగలరు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ ఢిఫెన్స్ సిబ్బందిని ప్రశంసించిన కింగ్ హమద్..!!
- కువైటీ చైల్డ్ మర్డర్ కేసు.. డొమెస్టిక్ వర్కర్ కు మరణశిక్ష..!!
- దుబాయ్ లో 15 కి.మీ. సెల్ఫ్-డ్రైవింగ్ జోన్ ఆవిష్కరణ..!!
- మహ్దా హనీ అండ్ డేట్స్ ఫోరం ప్రారంభం..!!
- ఖతార్ లో కార్మికులకు లేబర్ మినిస్ట్రీ అలెర్ట్ జారీ..!!
- CBSE 10th, 12th ఎగ్జామ్స్ షెడ్యూల్ ఖరారు..
- అవార్డులు గెలుచుకున్న రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం
- ఏపీలో భారీగా పెరిగిన వాహనాల అమ్మకాలు..!
- తెలంగాణ ప్రభుత్వం మైనారిటీ మహిళలకు ఆర్థిక సాయం
- ఫల, పుష్ప ప్రదర్శన, మీడియా సెంటర్ ప్రారంభించిన టీటీడీ చైర్మన్