సినిమా రివ్యూ.! ‘మంగళవారం’

- November 17, 2023 , by Maagulf
సినిమా రివ్యూ.! ‘మంగళవారం’

‘మంగళవారం’ అనే టైటిల్‌తోనే ఆసక్తి రేకెత్తించిన సినిమా ఇది. పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్రలో అజయ్ భూపతి తెరకెక్కించాడు. ఈ కాంబినేషన్ ‘ఆర్ఎక్స్ 100’తో సుపరిచితమే. సెన్సేషన్ హిట్ అయ్యింది ఆ సినిమా. అజయ్‌ డైరెక్షన్ టాలెంట్‌ని తొలి సినిమాతోనే అంతా గుర్తించారు. అయితే, రెండో సినిమా ‘మహా సముద్రం’తో ఆ టాలెంట్ కంటిన్యూ చేయలేకపోయాడు. దాంతో సింగిల్ మూవీ వండర్‌గా మిగిలిపోయాడు. కానీ, ‘మంగళవారం’ సినిమాతో మొదట్నించీ సమ్‌థింగ్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తూ వచ్చాడు అజయ్ భూపతి. దాంతో ఈ సినిమాపై అంచనాలు బాగా నెలకొన్నాయ్. మరి, ఆ అంచనాల్ని ‘మంగళవారం’ అందుకుందా.? లేదా.? తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.!

కథ:
గోదావరి ప్రాంతంలోని మహాలక్ష్మీ పురం అనే ఊరి కథ ఇది. ఆ ఊరిలో 1996 ప్రాంతంలో ఆ ఊరిలో అనుమానాస్పదంగా కొన్ని మరణాలు సంభవిస్తుంటాయ్. ఆ ఊరి అమ్మవారికి ఎంతో ఇష్టమైన మంగళవారం రోజు ఆ మరణాలు సంభవిస్తాయ్. అక్రమ సంబంధం పెట్టుకున్న రెండు జంటలు వరుసగా రెండు మంగళవారాలు అనుమానాస్పదంగా మరణించడం జరుగుతుంది. దాంతో, ఊరి జనం బెంబేలెత్తిపోతుంటారు. వారు ఆత్మహత్య చేసుకున్నారని ఊరిలో కొందరు నమ్మితే.. కాదు అవి హత్యలని ఆ ఊరి ఎస్ ఐ మాయ (నందిత శ్వేత) భావిస్తుంది. కాదు కాదు.. కొంత కాలం క్రితం సూసైడ్ చేసుకుని చనిపోయిన శైలజ (పాయల్ రాజ్‌పుత్) ఈ హత్యల్ని చేస్తుందని ఆ ఊరిలో కొందరు నమ్ముతుంటారు. అసలింతకీ ఆ హత్యలు ఎలా జరుగాయ్.? శైలజకీ, ఆ హత్యలకీ నిజంగానే సంబంధం వుందా.? పోలీసాఫీసర్ మాయ ఈ మిస్టరీని ఎలా ఛేదించింది.? మంగళవారం రోజే ఆ హత్యలు సంభవించడానికి కారణాలేంటీ.? అనేది తెలియాలంటే ‘మంగళవారం’ సినిమా ధియేటర్లలో చూడాల్సిందే.

నటీనటుల పనితీరు:
తొలి సినిమా ‘ఆర్ఎక్స్ 100’ లో పాయల్ రాజ్‌పుత్ బోల్డ్‌నెస్‌తో పాటూ, ఛాలెంజింగ్ రోల్ చేసిందనే చెప్పాలి. ఆ తరహా పాత్రలో మళ్లీ పాయల్ కనిపించింది లేదు. ‘మంగళవారం’ సినిమాతో మళ్లీ అజయ్ భూపతి ఆ తరహా పాత్రలోనే పాయల్ రాజ్‌పుత్‌ని చూపించి మెస్మరైజ్ చేశాడు. ఆ పాత్రలో అలవోకగా నటించి మరోసారి శభాష్ అనిపించుకుంది పాయల్ రాజ్ పుత్. నిజం చెప్పాలంటే ఈ సినిమాలో అంతకు మించి పర్‌ఫామెన్స్ ఇచ్చిందని చెప్పొచ్చు. బోల్డ్‌‌గా కనిపిస్తూనే తనలోని నటనకు పదును పెట్టింది ఈ సినిమాలో పాయల్. మరో ఇంపార్టెంట్ రోల్ చేసిన నందితా శ్వేత కటువుగా కనిపించే పోలీసాపీసర్ పాత్రలో సెట్ అయిపోయింది. కానీ, ఆమె పాత్రకు డబ్బింగ్ కాస్త ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. ప్రియదర్శి చిన్న రోల్ అయినా షాకింగ్ రోల్‌లో కనిపించి మెప్పిస్తాడు. కృష్ణ చైతన్య, రియా పిళ్లై, అజయ్ ఘోష్, అతిని అసిస్టెంట్ పాత్ర పోషించిన నటుడు.. ఇలా ఎవరి పాత్రల పరిధి మేర వాళ్లు బాగా నటించారు.

సాంకేతిక వర్గం పనితీరు:
అజయ్ భూపతి ఈజ్ బ్యాక్ అనొచ్చేమో ఈ సినిమాతో. తొలి సినిమాని ఎలాగైతే ట్విస్టులు మీద ట్విస్టులతో నింపేశాడో.. అంతకు మించిన ట్విస్టులతో ఈ మిస్టీరియస్ కథను నడిపించాడు. ప్రేక్షకులకు ఓ డిఫరెంట్ థ్రిల్లర్ మూవీ ఫీలింగ్ ఇచ్చాడు. సినిమా ప్రమోషన్లలో ఇండియాలోనే ఇలాంటి కథతో సినిమా వచ్చి వుండదు.. అని చెప్పాడు అజయ్.. నిజమేనేమో.. సరికొత్త థ్రిల్లింగ్ ఇచ్చాడు ‘మంగళవారం’తో. సినిమాటోగ్రఫీ సినిమాకి తగ్గట్లుగా వుంది. విజువల్స్‌ని క్యాప్చర్ చేయడంలో సినిమాటోగ్రఫర్ మంచి పని తనం ప్రదర్శించాడు. అజనీష్ లోక్‌నాధ్‌కి ఈ తరహా థ్రిల్లర్ మూవీస్‌కి సంగీతం అందించడం కొట్టిన పిండి. కథకి తగ్గట్టుగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదరగొట్టేశాడు. నిర్మాణ విలువలు బాగున్నాయ్. ఓవరాల్‌గా టెక్నికల్ బ్రిలియన్స్ మూవీగా అనిపిస్తుంది.

ప్లస్ పాయింట్స్:
పాయల్ రాజ్‌పుత్ పర్‌పామెన్స్, కొత్త కథా కాన్సెప్ట్, కథనం నడిపించిన వైనం,  నైట్ ఎఫెక్ట్ సన్నివేశాలు.. సెకండాఫ్‌లోని ఊహకందని ట్విస్టులు, థ్రిల్లింగ్ సన్నివేశాలు..

మైనస్ పాయింట్స్:
ఫస్టాఫ్‌లో కొన్ని రెగ్యులర్‌గా అనిపించిన సన్నివేశాలు..

చివరిగా:
‘మంగళవారం’.. ఓ డిఫరెంట్ థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com