యూఏఈలో భారీ వర్షాలు.. ప్రజా భద్రతా హెచ్చరిక జారీ
- November 17, 2023
యూఏఈ: అస్థిర వాతావరణ పరిస్థితులు యూఏఈని ఉక్కిరిబిక్కిరి చేశాయి. గురువారం రస్ అల్ ఖైమాలో ప్రారంభమైన భారీ వర్షాలు.. దేశంలోని మిగిలిన ప్రాంతాలకు వ్యాపించాయి. దీంతో అనేక మంది యూఏఈ నివాసితులు భారీ వర్షాలకు ప్రభావితం అయ్యారు. దుబాయ్ పోలీసులు నివాసితులకు హెచ్చరిక పంపడంతో ఫోన్‌లలలో హెచ్చరికల అలెర్ట్ పంపించారు. వాహనదారులు జాగ్రత్తగా వాహనాలు నడపాలని, అధికారులు సూచించిన సూచనలను పాటించాలని సూచించారు. దుబాయ్‌లోని అబు హేల్‌లో భారీ వర్షం కురిసిన వీడియోను సోషల్ మీడీయాలో షేర్ చేశారు. దుబాయ్ ఐకానిక్ బుర్జ్ ఖలీఫా మెరుపులు తాకాయి.
మరోవైపు దుబాయ్ పాఠశాలలు అస్థిర వాతావరణం నేపథ్యంలో ఆన్‌లైన్ లెర్నింగ్ కు ఆదేశించారు. అజ్మాన్, ఉమ్ అల్ ఖువైన్ మరియు రస్ అల్ ఖైమాలోని అధికారులు కూడా రిమోట్ లెర్నింగ్ చేపట్టాలని ఆదేశించారు. NCM ప్రకారం, శుక్రవారం ఉష్ణోగ్రతలు తగ్గుతాయని, రాత్రి మరియు శనివారం ఉదయం వాతావరణం తేమగా ఉంటుంది. దేశంలోని పర్వత ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు 14°Cకి పడిపోతాయని, యూఏఈలోని అంతర్గత ప్రాంతాల్లో గరిష్టంగా 33°Cకి చేరుకోవచ్చని అంచనా.
తాజా వార్తలు
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్: నిషేధిత వస్తువుల జాబితా..!!
- న్యూయార్క్ డిక్లరేషన్ ను స్వాగతించిన ఒమన్..!!
- తట్టై హిందూ కమ్యూనిటీ రక్తదాన శిబిరం..!!
- AI ఉపయోగించి కాపీరైట్ ఉల్లంఘన.. SR9000 జరిమానా
- ఖతార్ పీఎం తో అమెరికా సెంట్రల్ కమాండ్ కమాండర్ సమావేశం..!!
- కువైట్ లో 269 మంది అరెస్టు..!!
- మహిళల హకీ ఆసియా కప్‌లో ఫైనల్‌కు భారత్
- జెడ్డాలో ప్రారంభమైన జ్యువెలరీ ఎక్స్పోజిషన్..!!
- కువైట్ లో భారత రాయబారిగా పరమితా త్రిపాఠి..!!