నవంబర్ 20 నుంచి ఖతార్ ట్రావెల్ మార్ట్
- November 17, 2023
దోహా: ఖతార్ ట్రావెల్ మార్ట్ (క్యూటిఎమ్) రెండవ ఎడిషన్ నవంబర్ 20 ( సోమవారం) దోహా ఎగ్జిబిషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్ (డిఇసిసి)లో ప్రారంభం కానుంది. వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రి షేక్ మహ్మద్ బిన్ హమద్ బిన్ ఖాసిమ్ అల్ అబ్దుల్లా అల్ థానీ మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. నవంబర్ 22 వరకు ఈ ఎడిషన్ జరుగనుంది. ఉదయం 10 నుండి సాయంత్రం 7 గంటల వరకు మార్ట్ తెరిచి ఉంటుంది. క్రీడలు, సమావేశాలు, ప్రోత్సాహకాలు, ప్రదర్శనలు (MICE), సాంస్కృతిక, విశ్రాంతి, లగ్జరీ, వైద్య మరియు హలాల్ టూరిజంతో కూడిన ఏడు కీలక రంగాలకు సంబంధించిన ప్రదర్శలను ఏర్పాటు చేయనున్నారు. స్థానిక, అంతర్జాతీయంగా డెస్టినేషన్ మేనేజ్మెంట్ కంపెనీలు (DMCలు), టూర్ ఆపరేటర్లు, ట్రావెల్ ఏజెన్సీలు, ట్రావెల్ టెక్నాలజీ కంపెనీలు, అసోసియేషన్లు మరియు టూరిజం బోర్డులు వంటి సంస్థలను విస్తరించడం ఈ ఈవెంట్ లక్ష్యం. ఉచిత రిజిస్ట్రేషన్ కోసం www.qtmqatar.comని సందర్శించాలి.
తాజా వార్తలు
- అల్ సుడాన్ బస్ స్టేషన్లో రవాణా సేవలు అప్డేట్..!!
- ఒమన్ లో ఘోర ప్రమాదం..నలుగురు మృతి..!!
- గొడవలో కత్తిపోట్లకు గురై వ్యక్తి మృతి..!!
- కువైట్‌లో ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్..!!
- సౌదీ అరేబియాను తాకిన కోల్డ్ వేవ్స్..!!
- ఫాస్ట్ డిజిటల్ రుణాల వల్ల రిస్క్ ఉందా?
- వరల్డ్ ర్యాపిడ్ చెస్‌లో మెరిసిన తెలుగు తేజాలు..
- అందుకే కేసీఆర్‌కు షేక్‌హ్యాండ్ ఇచ్చాను: సీఎం రేవంత్
- శ్రీవారి మెట్ల మార్గంలో ప్రాథమిక చికిత్స కేంద్రం
- అగ్ని ప్రమాదంలో 16 మంది వృద్ధులు సజీవ దహనం







