గవర్నర్ వాపస్ చేసిన బిల్లులను పున:పరిశీలించండి: సీఎం స్టాలిన్
- November 18, 2023
చెన్నై: ఈరోజు తమిళనాడు అసెంబ్లీ లో ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఆ రాష్ట్ర సీఎం ఎంకే స్టాలిన్ ఆ తీర్మానాన్ని తీసుకువచ్చారు. గతంలో ఆమోదం పొందిన సుమారు 10 బిల్లలను పాస్ చేసే విధంగా రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి చర్యలు తీసుకోవాలని ఆ తీర్మానంలో సీఎం స్టాలిన్ కోరారు. ఎటువంటి కారణాలు లేకుండానే గవర్నర్ రవి తమ అసెంబ్లీలో ఆమోదం పొందిన బిల్లులను తిప్పి పంపినట్లు స్టాలిన్ ఆరోపించారు. 2020, 2023లో రెండు బిల్లులకు ఆమోదం దక్కిందని, మరో ఆరు బిల్లులు గత ఏడాది పాస్ చేశామని, కానీ ఇంత వరకు గవర్నర్ ఆ బిల్లులకు ఓకే చెప్పలేదని స్టాలిన్ పేర్కొన్నారు.
రాజ్యాంగంలోని 200వ ఆర్టికల్ ప్రకారం ఆ బిల్లులను మళ్లీ పాస్ చేశామని, తమిళనాడు అసెంబ్లీ రూల్ 143 ప్రకారం కూడా బిల్లులకు ఆమోదం దక్కిందని స్టాలిన్ అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను గవర్నర్ రవి అడ్డుకుంటున్నట్లు సీఎం స్టాలిన్ ఆరోపించారు. వ్యక్తిగత కారణాలతో గవర్నర్ తమ బిల్లులను వెనక్కి పంపారని, ఇది అప్రజాస్వామికమని సీఎం అన్నారు.
నాన్ బిజెపి రాష్ట్రాలను కేంద్రం కావాలనే టార్గెట్ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఒకవేళ ఏవైనా అనుమానాలు ఉంటే నివృత్తిక చేసుకోవాలని, కానీ ఆ బిల్లులకు ఆమోదం ఇవ్వకపోవడం శోచనీయం అన్నారు. అసెంబ్లీని, ప్రజల్ని గవర్నర్ రవి అవమానిస్తున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







