షార్జా గోదాములో అగ్నిప్రమాదం
- November 18, 2023
యూఏఈ: షార్జాలోని ఇండస్ట్రియల్ ఏరియాలోని గోదాములో శుక్రవారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం జరిగింది. అయితే సకాలంలో స్పందించిన అధికారులు వెంటనే మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. షార్జా పోలీస్ ఆపరేషన్స్ రూమ్‌కు మధ్యాహ్నం 3.34 గంటలకు యూజ్డ్ కార్ స్పేర్ పార్ట్స్ భద్రపరిచే గోదాములో మంటలు చెలరేగినట్లు ప్రాథమిక నివేదిక అందిందని తెలిపారు. అగ్నిప్రమాదం కారణంగా ఆకాశంలోకి దట్టమైన, నల్లటి పొగలు వ్యాపించాయి. ఇవి పొరుగున ఉన్న అజ్మాన్ వరకు కనిపించాయి. షార్జా సివిల్ డిఫెన్స్ నుండి బృందాలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది రికార్డు సమయంలో మంటలను నియంత్రించారు. దీంతో మంటలు చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాప్తి చెందకుండా నిరోధించారు. ఈ ఘటనలో ఎవరు గాయపడలేదని సమాచారం. అగ్నిప్రమాదానికి గల కారణాలపై ఇంకా వివరాలు తెలియరాలేదు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







