హైదరాబాద్ లో బీబత్సం సృష్టించిన గాలివాన

- May 25, 2016 , by Maagulf
హైదరాబాద్ లో బీబత్సం సృష్టించిన గాలివాన

నగరంలో బుధవారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. భారీ ఈదురుగాలులతో ప్రారంభమైన వాన ధాటికి దిల్ సుఖ్ నగర్, కొత్తపేట, కర్మాన్ ఘాట్, చైతన్యపురి, బేగంపేట, బంజారాహిల్స్ లలో చెట్లు నేల కూలాయి. చెట్లు కూలి వాహనాల మీద పడటంతో కార్లు, బైక్ లు భారీగా ధ్వంసమయ్యాయి.
బంజారాహిల్స్ లో బస్టాప్ మీద చెట్టు కూలిన సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. సనత్‌నగర్ బస్టాపు సమీపంలోని ఓ దుకాణం మీద కూడా ఓ చెట్టు కూలింది. జీహెచ్ఎంసీ అధికారులు సహాయక చర్యలు చేపట్టడంతో ట్రాఫిక్ కు అంతరాయం కలగలేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com