సౌదీ అరేబియాతో రైలు కనెక్టివిటి పై కువైట్ అధ్యయనం

- November 18, 2023 , by Maagulf
సౌదీ అరేబియాతో రైలు కనెక్టివిటి పై కువైట్ అధ్యయనం

  కువైట్: కువైట్-సౌదీ అరేబియాను కలిపే రైల్వే ప్రాజెక్ట్ కోసం ఆర్థిక, సాంకేతిక సాధ్యాసాధ్యాల అధ్యయనాన్ని నిర్వహించడానికి కువైట్ పబ్లిక్ వర్క్స్ మంత్రిత్వ శాఖ ఒక ఒప్పందంపై సంతకం చేసింది. సమగ్ర అధ్యయనం చేసేందుకు SYSRTA కూటమితో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సహకార ప్రయత్నం రెండు దేశాల మధ్య సురక్షితమైన రవాణా కోసం కనెక్టివిటీని మెరుగుపరచడం, స్థిరమైన, సమర్థవంతమైన రైల్వే నెట్ వర్క్ ని ఏర్పాటు చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఒప్పందం హిస్ హైనెస్ క్రౌన్ ప్రిన్స్ షేక్ మిషాల్ అల్-అహ్మద్, సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్, మహ్మద్ బిన్ సల్మాన్ ల భాగస్వామ్య దృష్టిని ప్రతిబింబిస్తుందని పబ్లిక్ వర్క్స్ మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ ఈద్ అల్-రషీది వెల్లడించారు. కువైట్ - రియాద్ మధ్య 650 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే లైను రానుంది.  ఈ రెండు నగరాల మధ్య రైల్వే కనెక్టివిటీ ద్వారా ప్రయాణ సమయం సుమారు రెండు గంటలకు తగ్గుతుంది. అధ్యయనం ఆరు నెలల్లో పూర్తవుతుందని భావిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com