అవినీతిని ఎదుర్కోవడానికి ఒక్కటైన సౌదీ అరేబియా, రష్యా
- November 19, 2023
మాస్కో: అవినీతిని ఎదుర్కోవడం, ఉమ్మడి సహకారాన్ని పెంపొందించే రంగంలో అవగాహన ఒప్పందం (MOU) పై సౌదీ అరేబియా కంట్రోల్ అండ్ యాంటీ కరప్షన్ అథారిటీ (నజాహా), రష్యా పబ్లిక్ ప్రాసిక్యూషన్ సర్వీస్ సంతకం చేశాయి. రష్యాలోని సౌదీ రాయబారి అబ్దుల్‌రహ్మాన్ అల్-అహ్మద్ సమక్షంలో రెండు దేశాల మధ్య అవగాహన ఒప్పందంపై నజాహా అధ్యక్షుడు మాజెన్ అల్-కహ్మౌస్, రష్యా ప్రాసిక్యూటర్ జనరల్ ఇగోర్ క్రాస్నోవ్ సంతకం చేశారు. ముఖ్యంగా సరిహద్దు అవినీతి నేరాలను ఎదుర్కోవడంలో సహకారాన్ని పెంపొందించడం, అవినీతి నేరాలకు సంబంధించిన సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం, రెండు సంస్థలు సంస్థాగత సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడం, బలోపేతం చేయడం వంటి అంశాలను ఒప్పందంలో పొందుపరిచారు. సమావేశం సందర్భంగా నజాహా అధ్యక్షుడు మాస్కోలోని యూనివర్సిటీ ఆఫ్ ప్రాసిక్యూటర్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్శనలో ఇరు పక్షాల మధ్య సహకార అంశాలను స్పృశించడంతో పాటు ఉమ్మడి ఆసక్తి ఉన్న పలు అంశాలపై చర్చించారు.
తాజా వార్తలు
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల
- డ్రగ్స్ కేసుల్లో చిక్కుకున్న విదేశీయులను వెనక్కి పంపనున్న కేంద్రం
- టీటీడీ ఈవోకు శుభాకాంక్షలు తెలిపిన టిటిడి పాలక మండలి