రికార్డు స్థాయిలో ఎన్టీఆర్ స్మారక నాణేల విక్రయం
- November 19, 2023
అమరావతి: దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శతజయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ముద్రించిన 100 స్మారక నాణేన్ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము విడుదల చేసిన సంగతి తెలిసిందే. భారతీయ సినిమా చరిత్రలో ఎన్టీఆర్ ఎంతో ప్రత్యేకమని రాష్ట్రపతి అన్నారు. రాముడు, శ్రీకృష్ణుడు ఇలా ఎన్నో పాత్రలకు ప్రాణం పోశారని ప్రశంసించారు. సీనీ, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్ ఎనలేని సేవలు అందించారని ద్రౌపది ముర్ము మెచ్చుకున్నారు. అప్పటినుంచి ఈ నాణేన్ని హైదరాబాద్ లోని మింట్ కాంపౌండ్ లో ముద్రిస్తున్నారు.
ఇప్పటివరకు 25 వేల ఎన్టీఆర్ స్మారక నాణేలు అమ్ముడయ్యాయి. భారత్ లో ఇంతవరకు ఇదే రికార్డు అని హైదరాబాద్ మింట్ సీజీఎం వీఎన్ఆర్ నాయుడు తెలిపారు. గతంలో ఈ రికార్డు 12 వేల అమ్మకాలు కాగా… ఇప్పుడు అంతకు రెండింతల అమ్మకాలతో ఎన్టీఆర్ స్మారక నాణేలు రికార్డు నెలకొల్పాయని వివరించారు.
తాజా వార్తలు
- దుబాయ్లో తెలుగు ప్రవాసుల ఘన క్రిస్మస్ వేడుకలు
- ఫ్లైనాస్ విమానానికి బాంబు బెదిరింపు..శంషాబాద్లో అత్యవసర ల్యాండింగ్
- కాలిఫోర్నియాలో ఇండియన్ సర్వీస్ సెంటర్ ఫ్రారంభం
- నిషేధిత లేదా నకిలీ పెస్టిసైడ్స్ తయారీ, దిగుమతి పై భారీ జరిమానా
- శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా
- అంతర్జాతీయ సైబర్ నెట్వర్క్ గుట్టురట్టు చేసిన సీఐడీ
- అర్జున అవార్డు రేసులో తెలంగాణ క్రీడాకారులు
- శంకర నేత్రాలయ లాస్ ఏంజెలెస్ చాప్టర్ కార్యక్రమం ఘన విజయం
- మౌలానా అబుల్ కలాం అజాద్ అవార్డు గ్రహీత సయ్యద్ నాజర్కు ఘన అభినందన సభ
- మస్కట్లో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన...







