వార్నింగ్ సైరన్లను పరీక్షించనున్న కువైట్
- November 20, 2023
కువైట్: అంతర్గత మంత్రిత్వ శాఖ యొక్క సాధారణ పౌర రక్షణ విభాగం నవంబర్ 21వ తేదీన (మంగళవారం) ఉదయం 10:00 గంటలకు సైరన్ల టోన్ల గురించి పౌరులు, నివాసితులకు అవగాహన కల్పించేందుకు హెచ్చరిక(వార్నింగ్) సైరన్లను పరీక్షిస్తుందని మంత్రిత్వ శాఖ ప్రకటించింది. సైరన్ల వివిధ టోన్లు, సూచనల గురించి అవగాహన కల్పించడం ఈ పరీక్ష ముఖ్య ఉద్దేశ్యం అని మంత్రిత్వ శాఖ ఆపరేషన్స్ అసిస్టెంట్ అండర్ సెక్రటరీ మేజర్-జనరల్ జమాల్ అల్-సాయెగ్ తెలిపారు. సైరన్ టోన్ లేదా సంబంధిత వాయిస్ మెసేజ్ వినబడకపోతే పౌర రక్షణ కార్యకలాపాలకు నంబర్ 25379278కు ఫోన్ చేయాలని ప్రకటన పౌరులను కోరింది. పౌరులు, నివాసితులకు అత్యవసర లేదా ప్రమాదం సంభవించినప్పుడు తప్పనిసరిగా తీసుకోవలసిన భద్రతా జాగ్రత్తలను గుర్తు చేయడానికి ఇటువంటి పరీక్షలను నిర్వహిస్తారు.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్‌లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్‌బోర్డ్‌పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







