త్రిషకు అండగా మెగాస్టార్ చిరంజీవి.!

- November 21, 2023 , by Maagulf
త్రిషకు అండగా మెగాస్టార్ చిరంజీవి.!

తమిళ నటుడు మన్సూర్ అలీ ఖాన్ హీరోయిన్ త్రిషపై చేసిన అనుచిత వ్యాఖ్యల దృష్ట్యా సోషల్ మీడియాలో పెద్ద రచ్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే.
ఈ విషయంలో మన తెలుగు హీరోలు సైతం రెస్సాండ్ అవుతున్నారు. ఆల్రెడీ నితిన్ తదితర హీరోలు స్పందించారు.
తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా ఇదే విషయమై స్పందించారు. పెద్దాయన అలాంటి వ్యాఖ్యలు చేయడం సబబు కాదని ఆయన అన్నారు. చిరంజీవి రెస్పాన్స్‌తో ఈ విషయం మరింత హాట్ టాపిక్ అయ్యింది.
కేవలం ఒక నటి గురించి అని మాత్రమే కాదు. ఈ తరహా వ్యాఖ్యలు ఏ మహిళనుద్దేశించి చేసినా అది తప్పే... అంటూ మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా హ్యాండిల్‌లో రెస్పాండ్ అయ్యారు.
గతంలో చిరంజీవి, త్రిష కలిసి ‘స్టాలిన్’ సినిమాలో నటించారు. ‘ఆచార్య’లో త్రిష నటించాల్సి వుంది. కానీ, కొన్ని కారణాల వల్ల అది జరగలేదు. ఫ్యూచర్‌లో ఈ జంట కలిసి నటించే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com