నాని రాజకీయం బెడిసికొడుతోందా.?
- November 21, 2023
నేచురల్ స్టార్ నాని ఈ మధ్య తన సినిమా ప్రమోషన్లను ఇన్నోవేటివ్‌గా ప్లాన్ చేస్తున్నాడు. తాజా సినిమా ‘హాయ్ నాన్న’ త్వరలో రిలీజ్ కానుంది. ఈ సినిమాని ప్రమోట్ చేయడానికి నాని రాజకీయాలను అస్త్రంగా వాడుతున్నాడు.
ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలకు రాజకీయ రంగులు పులుముతూ, రాజకీయ నాయకుడిలా గెటప్స్ వేసుకుని సినిమాని ప్రమోట్ చేస్తున్నాడు.
సరదా సరదాగా పంచ్ డైలాగులు విసురుతూ సినిమాని ప్రమోట్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో రాజకీయాలపైనా, మీడియాల పైనా పంచ్‌లు పేలుస్తున్నాడు.
సరదాగానే అయినా కాసింత గట్టిగానే వేసేస్తున్నాడు. సినిమా హిట్టయితే పర్వాలేదు.కానీ, తేడా కొడితే మాత్రం నానికి పెద్ద దెబ్బే అవుతుందది.
ఓవరాక్షన్ చేశాడంటూ ఏకి పారేస్తారు. గతంలో ‘శ్యామ్ సింఘరాయ్’ సినిమా విషయంలో నాని ఓవరాక్షన్ కాస్త తేడా కొట్టింది. ‘దసరా’కి కొట్టుకెళ్లిపోయిందనుకోండి. పెద్ద హిట్టే కొట్టేశాడు.
మరి, ‘హాయ్ నాన్న’ ఏం రిజల్ట్ వస్తుందో చూడాలిక. మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో హీరోయిన్ కాగా, శృతి హాసన్ గెస్ట్ రోల్ పోషిస్తోంది. డిశంబర్‌లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- ఖతార్ ఎయిర్వేస్ కు కొత్త సీఈఓ నియామకం..!!
- బీచ్లను క్లీన్ చేసిన కువైట్ డైవర్లు..!!
- సౌదీలో ఆరోగ్య సంరక్షణపై 95.7% మంది హ్యాపీ..!!
- ప్రైవసీ, డేటా ప్రొటెక్షన్ పై దృష్టి పెట్టండి..!!
- ఇండియా-ఒమన్ ఆర్థిక భాగస్వామ్యం..షురా కౌన్సిల్ సమీక్ష..!!
- హైదరాబాద్లో రోడ్లకు నూతన నామకరణం
- ఆఫ్లైన్ UPI: నెట్ అవసరం లేని చెల్లింపులు
- జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష తేదీ ఇదే!
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్







