విదేశాలకు వెళ్లే వారికి ముఖ్య గమనిక..
- November 21, 2023
న్యూ ఢిల్లీ: విదేశాలకు వెళ్లేవారు ఇలాంటి విషయాలను తప్పక తెలుసుకోవాలి..ఎందుకంటే.. ప్రయాణీకుడు నిర్దిష్ట పరిమితిలోపు మాత్రమే వస్తువులు, నగదును తీసుకెళ్లడానికి అనుమతిస్తారు. అలాకాకుండా పరిమితికి మించి తీసుకెళ్లినా ఇంటికి పంపిస్తారు. కాబట్టి, ప్రయాణానికి ముందు అలాంటి నియమాల గురించి తప్పక తెలుసుకోవాలి. వెళ్లిన చోట ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు ఎదుర్కొకుండా ఉండేందుకు పర్యాటకులు వీలైనంత ఎక్కువ నగదును తమ వద్ద ఉంచుకుంటారు. అయితే విదేశాలకు వెళ్లాలంటే కొంత పరిమితిలోపు నగదును తీసుకెళ్లాలి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సరళీకృత రెమిటెన్స్ పథకం ప్రకారం, భారతీయ ప్రయాణికులు కేవలం రూ. 1.89 కోట్లు మాత్రమే తీసుకువెళ్లడానికి అనుమతి ఉంది.
నేపాల్, భూటాన్ వంటి కొన్ని దేశాలు మినహా దాదాపు అన్ని దేశాలకు ప్రయాణించే ప్రయాణీకులు ఒక ప్రయాణానికి $3000 వరకు విదేశీ కరెన్సీని తీసుకువెళ్లడానికి అనుమతి ఉంటుంది.. మీరు ఇంతకంటే ఎక్కువ మొత్తాన్ని తీసుకెళ్లాలనుకుంటే, మీరు దానిని స్టోర్ వాల్యూ కార్డ్, ట్రావెలర్స్ చెక్, బ్యాంకర్ డ్రాఫ్ట్ రూపంలో తీసుకెళ్లవచ్చు.
ఒక భారతీయ యాత్రికుడు నేపాల్, భూటాన్ కాకుండా మరే ఇతర దేశానికి తాత్కాలిక పర్యటనకు వెళ్తున్నట్టయితే.. అతను భారతదేశానికి తిరిగి వచ్చినప్పుడు భారతీయ కరెన్సీ నోట్లను తిరిగి తీసుకురావచ్చు. అయితే ఈ మొత్తం రూ.25 వేలకు మించకూడదని గుర్తుంచుకోవాలి. నేపాల్, భూటాన్ గురించి చర్చించుకున్నట్టయితే.. అక్కడ నుండి తిరిగి వచ్చే సమయంలో ఎవరూ భారత ప్రభుత్వ కరెన్సీ నోట్లను 100 రూపాయల కంటే ఎక్కువ విలువైన RBI నోట్లను తీసుకెళ్లలేరు.
తాజా వార్తలు
- తెలంగాణలో ₹1,000 కోట్ల స్టార్టప్ ఫండ్ ప్రకటించిన సీఎం రేవంత్
- తిరుమలలో మరో స్కామ్: నకిలీ పట్టు దుపట్టా మోసం
- మాలికి ట్రావెల్ బ్యాన్..వెంటనే తిరిగిరండి..!!
- ఒమన్ లో అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం..!!
- దర్బ్ అల్ సయ్ లో నేషనల్ డే కార్యకలాపాలు..!!
- సౌదీ అరేబియాలో సీజనల్ రెయిన్ ఫాల్..!!
- మనమా సౌక్.. మనమా ఆత్మ, హార్ట్ బీట్..!!
- కువైట్ చేరిన ఇండియన్ కోస్ట్ గార్డు షిప్ సర్థాక్..!!
- ఎన్నికల తేదీల కోసం జనాల ఎదురు చూపులు: కేటీఆర్
- దేశ ప్రజలకు ప్రధాని మోదీ కీలక విజ్ఞప్తి..!







