చంద్రబాబు బెయిల్-సంతోషంలో ప్రవాసాంద్రులు
- November 23, 2023
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కి స్కిల్ కేసులో బెయిల్ వచ్చిన శుభసందర్భంలో సంతోషాన్ని ఆనందాన్ని పంచుకుంటూ "సత్యమేవ జయతే" కార్యక్రమాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం & జనసేన సభ్యులతో జూం వేదికగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిది కొమ్మారెడ్డి పట్టాభిరాం పాల్గొన్నారు. అలాగే ముఖ్యనేతలు ఎన్నారై టిడిపి సెల్ కో-ఆర్డినేటర్ చప్పిడి రాజశేఖర్, తెలుగుదేశం గల్ఫ్ కౌన్సిల్ అధ్యక్షుడు రావి రాధాకృష్ణ , గల్ఫ్ లోని వివిధ దేశాల ఎన్నారై టిడిపి అధ్యక్షులు వారి కార్యవర్గ సభ్యులు, గల్ఫ్ కౌన్సిల్ సభ్యులు, ఇతర దేశాల ఎన్నారై టిడిపి అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు. అలాగే గల్ఫ్ దేశాల లోని జనసేన జాతీయ కన్వీనర్స్ మరియు ప్రాంతీయ కన్వీనర్స్ కూడా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఎన్నారై తెలుగుదేశం కువైట్ మరియు జనసేన కువైట్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కాల్లోపట్టాభిరాం మాట్లాడుతూ చంద్రబాబు మచ్చలేని నాయకుడని,ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన 39 పేజీల చంద్రబాబు బెయిల్ రిపోర్ట్ లో వైసిపి చేసిన ఆరోపణలు నిరాధారమైనవి క్లియర్ గా వివరించబడ్డాయి అన్నారు. అలాగే ప్రవాసాంద్రులు అడిగిన వివిధ రకాల సందేహాలకు వివరంగా సమాదానాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఎన్నారై తెలుగుదేశం గల్ఫ్ ఎంపవర్మెంట్ కో-ఆర్డినేటర్ కుదరవల్లి సుధాకర రావు, ఎన్నారై తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వెంకట్ ఆళ్ళ, గొట్టిపాటి రమణయ్య, మొహమ్మద్ ఇమాం, అక్కిలి నాగేంద్రబాబు, మద్దిన ఈశ్వర్ నాయుడు గల్ఫ్ కౌన్సిల్ సభ్యులు సత్యనారయణ మలిరెడ్డి, ఖాదర్ బాషా. హరిబాబు తక్కెళ్ళపాటి మరియు ఇతర నాయకులు షేక్ బాషా, నరేష్ మద్దిపోటి, రవి పొనుగుమాటి, వాసు రెడ్డి. విక్రం సుఖవాసి, సుబ్బారెడ్డి గాజులపల్లి, సుబ్బారెడ్డి విసి, వరప్రసాద్, సారధి నాయుడు, భాస్కర్, రాఘవేంద్ర, రషీదా బేగం, కొల్లి ఆంజనేయులు, శివ మద్దిపట్ల, వంశీ కాపెర్ల, నరేష్, బాల రెడ్డయ్య, వెంకట్రామ రాజు, సుబ్బ రాజు, వెంకటబుజ్జి, సుగుణ, భాస్కర్, మోహన్, సిద్దులయ్య, మరియు జనసేన నాయకులు రామచంద్రనాయక్, శ్రీకాంత్ కాంచన, అంజన్ కుమార్ పగడాల, ఆకుల రాజేష్, జగిలి ఓబులేసు, కలుపురి భాస్కర్, సూర్య, గుంటూరు శంకర్, చంద్ర శేఖర్, పలుకూరి భాస్కర్ మొదలగువారు వందలాది మంది పాల్గొన్నారు. చివరిగా ఈకాల్లో పాల్గొన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సుధాకర రావు సమావేశాన్ని ముగించారు.



తాజా వార్తలు
- భారత జట్టు తదుపరి మ్యాచ్ల షెడ్యూల్ ఇదే..!
- బెంగళూరులో రేపటి నుంచి హోటళ్లు బంద్
- ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా దుబాయ్–వరుసగా ఆరవ సంవత్సరం గుర్తింపు
- తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..
- అమరవీరులకు కువైట్ కన్నీటి నివాళి: సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు
- లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పై విపక్షాలు అవిశ్వాస తీర్మానం
- యూఏఈలో హెలికాప్టర్ ప్రమాదం: ఇద్దరు సాయుధ దళాల సిబ్బంది మృతి
- గల్ఫ్ దేశాల్లో 12వ తరగతి పరీక్షలు వాయిదా–CBSE కీలక నిర్ణయం
- 23400 ఉల్లంఘనలు..1,200 వాహనాలు సీజ్..!!
- వీడియోలు, ఫోటోలు షేర్.. 313 మంది అరెస్టు..!!









