రానా నాయుడు అంతకు మించి వుంటుందా..! లేక.!
- November 23, 2023
దగ్గుబాటి బాబాయ్ అబ్బాయ్ వెంకటేష్, రానా కాంబినేషన్‌లో తెరకెక్కిన వెబ్ సీరీస్ ‘రానా నాయుడు’. మొదటి సీజన్ ‘రానా నాయుడు’ ఏ స్థాయిలో విమర్శలు అందుకున్నదో అందరికీ తెలిసిందే. వెంకటేష్ నటించిన సిరీస్ అంటే ఎలా వుండాలి.? కుటుంబం మొత్తం చక్కగా కూర్చొని చూసేలా వుండాలి.
కానీ, ‘రానా నాయుడు’ పూర్తిగా అడల్ట్ సిరీస్. కక్కుర్తికి పరాకాష్ట అన్నట్లుగా తెరకెక్కించారు. అసలు వెంకటేష్ ఎలా ఈ సిరీస్‌లో నటించాడు.? అని ముక్కున వేలేసుకున్నారు ‘రానా నాయుడు’ చూసిన వాళ్లంతా.
రీసెంట్‌గా తన తాజా మూవీ ‘సైంధవ్’ ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్న వెంకటేష్ ముందు ఈ సిరీస్‌కి సంబంధించిన ప్రశ్న తలెత్తగా.. ఏం చేస్తాం.! పెద్దోళ్లేమో తిట్టుకున్నారు. మీ కుర్రోళ్లేమో తెగ చూసేశారు.. కానీ, సెకండ్ సీజన్ సిరీస్ విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకుంటాం.. అందరూ చూసేలా ‘రానా నాయుడు’ తెరకెక్కిస్తాం.. ’ అని వెంకటేష్ తెలిపారు.
అంటే, ‘రానా నాయుడు’ రెండో సీజన్‌ని ఒళ్లు దగ్గర పెట్టుకుని తెరకెక్కించబోతున్నారని అర్ధమవుతోంది. బూతులు, అడల్ట్ సీన్లకు కాస్త దూరంగా వుండేలా చూసుకుంటున్నారని అర్ధమవుతోంది. అయితే, తిడుతూనే ఫస్ట్ సీజన్‌కి వచ్చిన రెస్పాన్స్‌తో రెండో సీజన్‌లో ఇంటిమేట్ సీన్లు ఇంకాస్త గట్టిగానే వుండేలా తెరకెక్కించారని ఇన్‌సైడ్ సోర్సెస్ సమాచారం. ఏమో,! చూడాలి మరి, ‘రానా నాయుడు’ రెండో డోస్ ఏ రేంజ్‌లో వుండబోతోందో.!
తాజా వార్తలు
- హైదరాబాద్‌లో రోడ్లకు నూతన నామకరణం
- ఆఫ్‌లైన్ UPI: నెట్ అవసరం లేని చెల్లింపులు
- జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష తేదీ ఇదే!
- DP World to develop strategic border facilities in Afghanistan under landmark agreement
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్
- ప్రయాణికులకు రూ.610 కోట్లు రీఫండ్ చేసిన ఇండిగో
- వెంకప్ప భాగవతులకు ‘బెస్ట్ ఫిలాంత్రఫీ అవార్డు’
- పవన్ కళ్యాణ్ కు అరుదైన బిరుదు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!







