‘తండేల్’గా నాగ చైతన్య.!
- November 23, 2023
అక్కినేని హీరో నాగ చైతన్య, చందూ మొండేటి కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రానికి ‘తండేల్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. టైటిల్ రిలీజ్ చేస్తూ నాగ చైతన్య లుక్ కూడా వదిలారు.
ఈ లుక్స్‌లో నాగ చైతన్య సిక్స్ ప్యాక్‌తో పర్‌ఫెక్ట్ ఫిట్‌గా కనిపిస్తున్నారు. రెస్పాన్స్ విషయానికి వస్తే, కాస్త మిక్స్‌డ్ రెస్పాన్స్ వస్తోంది. బ్యాక్ గ్రౌండ్ బ్లాక్‌లో చై సిక్స్ ప్యాక్‌తో మెరిసిపోతున్నాడు.
బెస్తవాళ్లు (జాలర్ల) యదార్ధ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా జాలరి కుటుంబానికి చెందిన ఓ ప్రముఖ వ్యక్తి జీవిత గాధ ఆధారంగా ఈ సినిమాకి కథ సిద్ధం చేశాడు చందూ మొండేటి.
ఆ నేపథ్యంలో కథకు అనుగుణంగా ఆ వ్యక్తిని రియల్‌గా కలిసి చాలా విషయాలు తెలుసుకున్నారు చైతూ, చందూ మొండేటి. అలాగే, బెస్తవాళ్లు ఎలా వుంటారు.? వారి హావ భావాలు, నడక, నడతను దగ్గరుండి తెలుసుకున్నాడు చైతూ.
ఈ సినిమాని చాలా సీరియస్‌గా తీసుకున్నట్లున్నాడు. అందుకోసం శ్రీకాకుళం యాసని కూడా బాగా ప్రాక్టీస్ చేశాడు. అదే తనకు పెద్ద టాస్క్ అయ్యిందంటున్నాడు చై. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటించడం మరో అస్సెట్.
తాజా వార్తలు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!
- బహ్రెయిన్ జైళ్లు ఇక పునరావాస కేంద్రాలు..!!
- ఒమన్‌లో 42వేల వాణిజ్య రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- యూఏఈలో న్యూఇయర్ ఫైర్ వర్క్స్ జరిగే ప్రాంతాలు..!!
- గల్ఫ్-ఈయూ పార్టనర్షిప్, ఇంధన భద్రత తప్పనిసరి..!!
- సౌదీలో లేబర్, బార్డర్ చట్టాల ఉల్లంఘనదారులు అరెస్టు..!!
- గోవా నైట్ క్లబ్లో భారీ అగ్ని ప్రమాదం, 25 మంది మృతి
- తెలంగాణలో కొత్త విమానాశ్రయాలు..
- విదేశాల్లో ఉన్నవారికి అండగా ఉంటాం: మంత్రి లోకేశ్
- డాక్టర్ అనురాధ కోడూరి ‘మై బాలీవుడ్ రొమాన్స్’ నవల ఆవిష్కరణ







